Breaking News

ఎవరీ తేజ్‌పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌కు ముందు..

Published on Mon, 04/28/2025 - 13:22

ఇస్రో, నాసా కలిసి చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌ను కొన్ని వారాల్లో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. పైగా ఈ ఆక్సియం-4 మిషన్‌కి పైలట్‌గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా వ్యవహరించనున్నారు. సరిగ్గా ఈ చారిత్రాత్మక మిషన్‌కి ముందు ఆక్సియమ్ స్పేస్ నాయకత్వంలో అనుహ్యంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అదికూడా మన భారత సంతతి వ్యక్తే నియమాకం కావడం విశేషం. అతనెవరు..? ఎలా ఈ అవకాశం వరించింది అంటే..!

ఇస్రో నాసో చారితత్రాత్మక మిషన్‌ ముందు ప్రధాన నాయకత్వంలో మార్పులు చేసింది ఆక్సియమ్‌ స్పేస్‌. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ తేజ్‌పాల్ భాటియాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత నాలుగేళ్లుగా కంపెనీకి చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేసిన భాటియా మునుపటి సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్‌ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ కామ్ గఫారియన్ స్థానంలోకి రానున్నారు. 

ఇక గఫారియన్ ఆక్సియమ్‌ స్పేస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఆక్సియమ్ ఆక్స్-4 మిషన్‌లో భారతీయ వ్యోమగామిని ప్రారంభించటానికి ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. నిజానికి ఈ మిషన్‌ని భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణానికి కొత్త యుగంలోకి ప్రవేశించేలా చేసే గొప్ప సహకారంగా పేర్కొనవచ్చు. పైగా ఇది ఐఎస్‌ఎస్‌కి నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి  మిషన్‌.

భాటియా ఎవరంటే..
2021లో గూగుల్ నుంచి ఆక్సియం స్పేస్‌లో చేరినప్పటి నుంచి భాటియా ఎన్నో మైలురాయి ఒప్పందాలు, మిషన్‌లకు మార్గదర్శకత్వం వహించారు. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వాణిజ్య మానవ అంతరిక్ష విమాన మిషన్ల పరిశ్రమకి సంబంధించిన మొట్టమొదటి సార్వభౌమ ప్రభుత్వ కొనుగోళ్లకు నాయకత్వం వహించారు. అందులో ఆక్సియం మిషన్-4 సంచలనాత్మక ఆక్సియం మిషన్-1(Ax-1) కూడా ఉంది. 

ఆయన  ఆర్టెమిస్ III చంద్ర మిషన్ కోసం తదుపరి తరం స్పేస్‌సూట్‌లపై ప్రాడాతో భాగస్వామ్యం, చంద్ర అన్వేషణ స్పేస్‌సూట్‌లలో హై-స్పీడ్ సెల్యులార్ కనెక్టివిటీని ఏకీకృతం చేసేందుకు నోకియాతో కలిసి అధిక-ప్రభావ క్రాస్-ఇండస్ట్రీ సహకారాలు తదితరాలను పర్యవేక్షించారు. అలాగే ఆక్సియం స్పేస్‌ని నెలకొల్పి మానవ అంతరిక్ష పరిశోధన కోసం ప్రముఖ ఆవిష్కర్తగానూ, వాణిజ్య సమగ్రకర్తగానూ ఉన్నారు. 

ఈ మేరకు భాటియా మాట్లాడుతూ.. చిన్పటి నుంచి అంతరిక్ష అన్వేషణ ద్వారా స్ఫూర్తి పొందాను. ఆ క్రమంలో ఈ ఆక్సియమ్‌ స్పేస్‌ను నడిపించగలిగానని, అదే తన జీవతాశయాంలోని కీలక మలుపు అని అన్నారు. తాము తదుపరి సాంకేతికతలలో స్పేస్‌సూట్‌లు, ఆర్బిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైక్రోగ్రావిటీ పరిశోధన, తదితరాలలో పెట్టుబడులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అంతరిక్షంలో మానవాళి భవిష్యత్తును నిర్మించడంలో సహాయం చేసేందుకు మరింతమంది చురుకైన సాంకేతిక నిపుణులు, దూరదృష్టిగల ఇంజనీర్లు, వ్యవస్థాపకులు కావాలని అన్నారు. 

ఇక భాటియా దీనిలో ఫార్చ్యూన్ 100 ఎగ్జిక్యూటివ్‌లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, స్టార్టప్ వ్యవస్థాపకులను నిమగ్నం చేశాడు. పైగా రూ. 400 కోట్లకు పైగా అమ్మకాలకు మద్దతిచ్చాడు. అలాగే ఆక్సియం ఆలోచనలను వాస్తవ రూపంలోకి మార్చడంలో భాటియా అత్యంత కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు మాజీ సీఈవో కామ్ గఫారియన్. 

(చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్‌ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..)

 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)