Breaking News

మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్‌ చేసిన ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌

Published on Wed, 04/03/2024 - 14:14

కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌. 

ఏం జరిగిందంటే?..సౌత్‌ చైనాలోని హంకాంగ్‌కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్‌ చేసి చూపించాడు. అతను హాంకాంగ్‌లోని అమోలి ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు.

అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే బెటర్‌గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్‌, వాకింగ్‌ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్‌ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్‌ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్‌, భారత్‌ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్‌లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు.

అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్‌లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్‌ ఫంక్షన్‌ టెక్నిక్‌ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్‌లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్‌ తింటానని చెప్పారు. అలాగే లంచ్‌, డిన్నర్‌లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు.

చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్‌ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్‌ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్‌ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్‌లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్‌ని కట్టడి చేశారు రవిచంద్ర.

(చదవండి: చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..)

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)