Breaking News

అత్యధిక మిలియనీర్స్‌ ఉన్న భారతీయ నగరం ఇదే..!

Published on Wed, 05/08/2024 - 11:43

ప్రపంచంలోనే అత్యధిక మిలియర్లు ఉన్న నగరాల జాబితాను ఏటా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ ఇస్తుంది. సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్‌ దాదాపు మూడు లక్షల మిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నివాసితులు ప్రపంచంలోని ఇతర మెట్రో నగరాల కంటే దాదాపు మూడు డాలర్ల ట్రిలయన్లకు పైగా సంపదను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక్కడ మిలియనీర్ల సంఖ్య సుమారు 4% పెరిగినట్లు తెలిపింది. న్యూయార్క్‌లో 2013 నుంచి ఇప్పటి వరకు అంత్యంత సంపన్నుల సంఖ్యలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 60 బిలియనీర్లు ఉన్నారని,  వారిలో చాలామంది దాదాపు రూ. 800 ‍కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలరని వెల్లడించింది. 

ఇక శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియాలో మాత్రం మూడు లక్షల మంది  కోట్లల్లో నికర విలువ కలిగి ఉండటంతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇక ఈ అత్యధిక మిలియనీర్స్‌ జాబితాలో టోక్యో మూడో స్థానంలో ఉండగా, సింగపూర్‌ నాల్గో స్థానంలో ఉంది. కాగా హెన్లీ & పార్ట్‌నర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుర్గ్ స్టెఫెన్ ప్రకారం గత కొన్ని ఏళ్లలో ఆర్థిక మార్కెట్‌లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని కొన్ని అత్యంత సంపన్న నగరాల వృద్దిని పెంచింది. 

పైగా వాటి గ్లోబల్ ఈక్విటీలు 2023లోనే సుమారు 20% పెరగగా, ఈ ఏడాది ఏకంగా 7% పెరిగాయి. దీంతో కొన్ని ప్రపంచ నగరాల అదృష్టం తారుమారయ్యిందని చెబుతోంది హెన్లీ & పార్ట్‌నర్స్ సర్వే.  గత దశాబ్దంలో లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని యూకే తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. అలాగే చైనా మహమ్మారి టైంలో విధించిన ఆంక్షలు కారణంతో  సంపన్న ప్రవాసులు సింగపూర్‌కు  తరలిరావడంతో హాంకాంగ్ దాని మిలియనీర్ ర్యాంక్‌లలో 4% క్షీణతను చవి చూసింది. 

ఇదే సమయంలో కొన్ని నగరాల్లో మిలియనీర్ల వృద్ది అనూహ్యంగా పెరిగింది వాటిలో షెన్‌జెన్ కూడా ఉంది, ఇక్కడ గత దశాబ్దంలో మిలియనీర్ల సంఖ్య సుమారు 140% పెరిగింది. ఇక గత 10 ఏళ్లలో రెట్టింపుకు పైగా మిలియనీర్ జనాభా పెరిగిన నగరాలు వరుసగా భారతదేశంలోని బెంగళూరు, హో చి మిన్ సిటీ, వియత్నాం,  యూఎస్‌లో అరిజోనాలోని స్కాట్స్‌డేల్ వంటి నగరాలు. కాగా ఆ జాబితాలో సంపన్న నగరంగా దుబాయ్‌​ 21వ స్థానం దక్కించుకోగా,  మొనాకో నెంబర్‌ 1  స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారని హెన్లీ & పార్ట్‌నర్స్ సర్వే చెబుతోంది.  

(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థ)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)