Breaking News

Sudha Reddy: ఫ్యాషన్‌ ఐకాన్‌.. సుధారెడ్డి

Published on Sat, 09/28/2024 - 08:53

సుధారెడ్డి.. ఆమె ఒక ఫ్యాషన్‌ ఐకాన్‌. దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయితో ప్రముఖ ఫ్యాషన్‌ వేదికలపై తన సౌందర్యంతో పాటు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని మరింత ఉన్నతంగా ప్రదర్శించిన మహిళ. భారత్‌ తరపున గ్లోబల్‌ ఈవెంట్‌ మెట్‌గాలా మొదలు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌ పై నడిచిన అతి కొద్ది మందిలో తానొకరు. అంతేకాకుండా సుధారెడ్డి ఫౌండేషన్‌ ప్రారంభించి నిరుపేదల ఆకలి నుంచి మహమ్మారి క్యాన్సర్‌ వ్యాధి బాధితుల వరకూ సహకారం అందించడానికి కృషి చేస్తున్నారు. యూనిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద మంది ఛైర్‌లలో ఆమె కూడా ఒకరు. యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ నుంచి ఫ్యాషన్‌ 4 డెవలప్‌మెంట్‌ ఫిలాంత్రోఫిక్‌ అవార్డు పొందిన మొదటి భారతీయురాలు. ఆమె ప్రయాణం మహిళా సాధికారతకు స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం గురించి సాక్షితో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..     

హైదరాబాద్‌ టూ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. ఫ్యాషన్, సేవ, వ్యాపారం, ఎన్‌జీఓ ఇలా అనేక రంగాల్లో ఆమె తన ప్రతిభను చాటుకుంటున్నారు. ‘ఇన్ని రంగాలను ఎలా మేనేజ్‌ చేస్తున్నావని చాలా మంది అడుగుతుంటారు. కానీ, నేను చేసే పనిని  ఆస్వాదిస్తాను. అది బిజినెస్‌ ఐనా, సేవ ఐనా ఇంకేదైనా. చేసే పనిని ఇష్టపడేవారికి బిజీ అనే పదం తెలియదు. మెట్‌ గాలా, పారిస్‌ హాట్‌ కోచర్‌ వీక్, పారిస్‌ ఫ్యాషన్‌ వీక్, కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి వేదికలపై నడవడం నేనేమీ ప్రత్యేకంగా ఫీల్‌ అవ్వను. 

అదే మన దేశ విశిష్టత. విదేశాల్లో భారత్‌ను ఎంత గౌరవంగా చూస్తారో చాలామందికి తెలియదు. అలాంటి వేదికలపై దేశ గత వైభవాన్ని కొనసాగించేలా నావంతు ప్రయత్నం చేస్తాను. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతూ లుల్లా ఆధ్వర్యంలో నా దుస్తులు, అలంకరణలను రూపొందించుకుంటాను. మనకు నచి్చనట్టుగా ఉండటమే సౌందర్యం అని భావిస్తాను. ఒక విద్యారి్థగా, భార్యగా, తల్లిగా, ఫ్యాషన్‌ ఔత్సాహికురాలిగా, సేవకురాలిగా ప్రతి ప్రయాణాన్నీ అమితంగా ఆస్వాదించాను.  

అన్నార్థులకే మొదటి ప్రాధాన్యత.. 
నా కుటుంబంతో గడిపే సమయం నేనెంతగానో ఆస్వాదిస్తాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా ఎక్ట్సెండెండ్‌ ఫ్యామిలీగానే భావిస్తాను. సమాజానికి ఏదైనా చేయాలనే సుధారెడ్డి ఫౌండేషన్‌ స్థాపించాను. నా భర్త కృష్ణారెడ్డి ఎమ్‌ఈఐఎల్‌ ఫౌండేషన్‌తో పాటు నా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మేము ఏనాడూ ఫండ్‌ రైజింగ్‌ చేయలేదు. ప్రకృతి అందించే సహజ వనరుల్లో ఆహారం ఒకటి. అందుకే పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాను. నగరంలోని మా ఇంటి మందు ప్రతి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకూ ఆహారం అందిస్తున్నాం. ఇంట్లో తినే ఆహారమే ఇక్కడ వడ్డిస్తాం. నేను విదేశాల్లో ఉన్నాసరే.. ఆహారం పంపిణీ అయ్యాకే నేను లంచ్‌ చేస్తాను. 

ఎవరినైనా లంచ్‌కు పిలిచినా 2 గంటల తర్వాతే ఆహా్వనిస్తాను. అంతర్జాతీయ సేవా సంస్థ యూనిసెఫ్‌ వరల్డ్‌ ఫోరంలో భారత్‌ తరపున బ్రాండ్‌ అంబాసిడర్‌గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. భారత్‌లో 14 నుంచి 19 ఏళ్ల వయసు చిన్నారులు బాలకారి్మకులుగా, బాల నేరస్తులుగా మారుతున్నారు. యూనిసెఫ్‌ అడాలసిస్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా వారికి డెవలప్మెంట్‌ స్కిల్స్‌లో శిక్షణ అందించి మేమే ఉద్యోగాలను అందిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ను గుజరాత్, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 29న బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కలి్పంచడానికి అతిపెద్ద రన్‌ నిర్వహిస్తున్నాం.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు