Breaking News

స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్‌ స్వీట్‌ ఏంటో తెలుసా!

Published on Tue, 08/15/2023 - 14:40

యావత్తు దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఈ సెలవురోజును త్రివర్ణ రంగులతో కూడిని తీపి వంటకాలతో మరింత ఆనందంగా వేడుక చేసుకోండి. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఓ ఐకానిక్‌ వంటకం గూర్చి తెలుసుకుందాం. దీన్ని వారణాసిలోని ఓ ప్రముఖ ఐకానిక్‌ షాప్‌ 1939లో తయారు చేసింది. ఆ షాపు వాళ్లు త్రివర్ణ రంగులతో కూడిన బర్ఫీ అనే స్వీట్‌ని దేశభక్తిని రగిల్చేందుకు తయారు చేశారు.

అది బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిందట. దీంతో  ఈ స్వీట్‌ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతికగా నిలిచిన ఐకానిక్‌ వంటకంగా  పేరుతెచ్చుకుంది. ఏకంగా వంటకాలతో కూడా బ్రిటీషర్లను గడగలాడించిన ఘనత మన భారతీయులదే. స్వేచ్ఛ కోసం పరితపించిన అలానాటి త్యాగధనులను స్మరించుకుంటూ.. ఈ త్రివర్ణ బర్ఫీ స్వీట్‌  తయారీ ఎలాగో తెలుసుకుందామా!.

తిరంగ్‌ బర్ఫీ తయారీ విధానం:
కావల్సిన పదార్థాలు:
పంచదార: వంద గ్రాములు
పాలు: రెండు లీటర్లు
యాలకుల పొడి - 5 గ్రా

నెయ్యి - 50 గ్రా

కుంకుమపువ్వు తగ్గింపు (కాషాయం రంగు కోసం)

బచ్చలికూర పేస్ట్ (ఆకుపచ్చ రంగు కోసం)
తయారీ విధానం: ఒక కడాయి తీసుకుని అందులో పాలు పంచాదార వేసి బాగా మరిగించాలి. సగం వరకు బాయిల్‌ అయ్యేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మిశ్రమం బాగా చిక్కబడుతుందనంగా యాలకుల పొడి వేయండి. ఆ తర్వత దించుకుని ఆ మిశ్రమాన్ని మూడు బాగాలుగా చేసుకుని ఒకదానిలో కుంకుమ పువ్వు రంగను మరొక దానిలో బచ్చలి కూర పేస్ట్‌ను వేయండి. ఇక మిగిలిన మూడో భాగం నెమ్మదిగా పరుచకుని దానిపై ఆ రెండు రంగుల భాగాలను పరుచుకోండి ఆ తర్వాత చక్కటి షేప్‌లో ముక్కలుగా కొయ్యండి. అంతే మదురమైన త్రివర్ణ బర్ఫీ రెడీ.

(చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!)

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)