Breaking News

Independence Day 2023: స్వాతంత్య్రాన్ని ఇలా ఎంజాయ్‌ చేయండి!

Published on Tue, 08/15/2023 - 00:38

నేటి టెక్నాలజీ యుగంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని హాలిడేగా తీసుకుని ఆనందించే వారే ఎక్కువ. స్కూలు, కాలేజీ విద్యార్థులైతే జెండా వందనం తరువాత ఇంటికెళ్లిపోవచ్చు అని తెగ సంబరపడిపోతుంటారు. కానీ డెబ్బై ఆరేళ్లుగా విరామం లేకుండ జరుపుకొంటూ నేడు 77వ వసంతంలో అడుగు పెట్టాం. దేశాన్ని పాలించే అధికారులు అధికారికంగా ఈ వేడుకలు జరిపిస్తున్నారు. బాధ్యత గల పౌరులుగా మనం ఇలా సెలబ్రేట్‌ చేసుకుందాం....

► ఉదయాన్నే ఎర్రకోటపై జరిగే జెండావందనం, వివిధ కార్యక్రమాలను టీవీలో చూడాలి. డెభ్బై ఏడేళ్ల స్వాతంత్య్ర భారతం ఎంత ఎత్తుకు ఎదిగిందన్న అంశాలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడం ద్వారా తెలుసుకోవచ్చు
► తరువాత ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేసుకి ఈరోజు వెళ్లండి. ఒక రోజులో వెళ్లిరాగల ప్రాంతానికి వెళ్లి అక్కడ గడిపి మీ ఒత్తిడిని దూరం చేసుకోండి. అక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా గడపండి.
► రోజూ వేసుకునే దుస్తులు కాకుండా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలాంటి దుస్తులు ధరించండి. వీలైనంత వరకు డ్రెస్‌లో తెలుపు, కాషాయం, ఆకుపచ్చని రంగులు ఉండేలా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు త్రివర్ణ పతాకానికి మరింత వన్నె తెచ్చిన వారవుతారు
► ఎక్కడికీ వెళ్లే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే ఉండి దేశభక్తి సినిమాలు చూడండి. మీతోపాటు మీ పిల్లలకు మన దేశ చరిత్ర, ఔన్నత్యాలు తెలుస్తాయి
► మరింత ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకోవాలంటే మూడు రంగులు ఉండేలా వెరైటీ డిష్‌లు తయారు చేసుకుని తినండి
► స్వాతంత్య్ర దినోత్సవం అర్థం ఉట్టిపడేలా గాలిపటాలు ఎగరవేయండి. మూడు రంగుల్లో ఉన్న గాలిపటాలను వీలైనంత ఎత్తుకుఎగరేస్తూ మనకొచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్‌ చేయవచ్చు
► పుస్తకాల పురుగులు అయితే దేశభక్తి పుస్తకాలను చదవండి. స్వాతంత్య్ర సమర యోధుల విజయగాధలు, వీరిలో బాగా పాపులర్‌ అయిన నాయకుల బయోగ్రఫీని చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు
► దేశభక్తి గీతాలు వింటూ కూడా సంబరాలు జరుపుకోవచ్చు. అలనాటి పోరాట, అసామాన్య త్యాగాలను గుర్తుచేసే పాటలను వినాలి. లతా మంగేష్కర్, మహ్మద్‌ రఫీ, ఏఆర్‌ రెహ్మాన్‌ పాటలు మనలో నిద్రపోతున్న దేశభక్తిని తట్టి లేపుతాయి
► ఇంటి చుట్టుపక్కల వారు లేదా బంధువులు, కుటుంబ సభ్యులతో దగ్గరలో జరుగుతోన్న జెండా పండుగకు వెళ్లి రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి జైహింద్‌ కొట్టాలి ∙దేశానికి పెద్ద సేవ చేయలేక పోయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్న వారందరికి స్వీట్లు పంచి, నోరు తీపి చేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి.
► ప్రతి భారతీయుడికి ఎంతో విలువైన బహుమతులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అందుకే వీలైనంత వరకు అందరితో కలిసి జరుపుకోవాల్సిన జెండా పండుగ ఇది. సెలవు దొరికింది అని సంబరపడిపోక వీటిలో ఏ ఒక్కదాన్ని పాటించినా స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవించినట్లే.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)