లోకేష్ చేతుల కింద పవన్.. ఉస్తాద్ ఫ్యాన్స్ కు చెమటలు పట్టే వీడియో..
Breaking News
బరువెక్కుతున్న బాల్యం బాల ‘భార’తం
Published on Wed, 03/25/2026 - 04:14
ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన చిన్నారులు మోయలేని బరువు మోస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల్లో ఊబకాయం మహమ్మారిలా విస్తరిస్తోంది. అరికట్టడానికి రూపొందించుకున్న ప్రణాళికలు సైతం నీరుగారిపోతున్నాయని తాజా నివేదికలుహెచ్చరిస్తున్నాయి. ఈ ‘బరువెక్కిన’ దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ముంచుకొస్తున్న ముప్పునకు ఒక హెచ్చరిక.
⇒ వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 నాటికి చిన్నపిల్లల్లో ఊబకాయాన్ని అరికట్టాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఈ లక్ష్యం విఫలయత్నంగా మిగిలిపోవడం నిరాశ కలిగించే అంశం.
⇒ ఇదే లక్ష్య సాధన కోసం గడువును ఇప్పుడు 2030 వరకు పొడిగించినప్పటికీ, చాలా దేశాలు ఇందుకు సిద్ధంగా లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ ధోరణిని నియంత్రించడంలో ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారత్ కూడా ఉండటం
ఆందోళన కలిగించే అంశం.
⇒ కోట్లాది మంది భారతీయ పిల్లలు ఇప్పటికే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. 2025లో భారతదేశంలో 5 నుంచి 9 ఏళ్ల వయస్సు గల దాదాపు 1.49 కోట్ల (14.921 మిలియన్లు) మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉన్నారు.
⇒ 10 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారిలో అధిక బరువు, ఊబకాయుల సంఖ్య ఇంకా ఎక్కువగా, అంటే 2.64 కోట్లు (26.402 మిలియన్లు) గా ఉంది.
⇒ మొత్తంమీద భారతదేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బిఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్– ఎత్తుకుతగ్గ బరువును కలిగి ఉండటాన్ని కొలిచే ప్రామాణిక పద్ధతి)తో జీవిస్తున్నారు. వీరిలో 1.4 కోట్ల మంది ఊబకాయం గలవారిగా గుర్తించారు.
⇒ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 5 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఐదుగురు పిల్లలలో ఒకరు (20.7 శాతం) అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బందిపడుతున్నారు. 2010లో ఇది 14.6 శాతంగా ఉండేది, ఇప్పుడు గణనీయంగా పెరిగింది.
⇒ ఇదే ధోరణి ముందురోజుల్లోనూ కొనసాగితే, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50.7 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది.
⇒ కేవలం 10 దేశాల్లోనే 20 కోట్లకు పైగా పాఠశాల వయస్సు పిల్లలు అధిక బి.ఎం.ఐ తో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అధిక బి.ఎం.ఐ. ఉన్న పిల్లల సంఖ్యలో చైనా, భారత్, అమెరికా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
⇒ చైనాలో 6.2 కోట్ల మంది పిల్లలు అధిక బి.ఎం.ఐ. తో ఉండగా, అందులో 3.3 కోట్ల మంది ఊబకాయంతో ఉన్నారు.
⇒ అమెరికాలో 2.7 కోట్ల మంది పిల్లలు అధిక బి.ఎం.ఐ తో ఉండగా, అందులో 1.3 కోట్ల మంది ఊబకాయంతో ఉన్నారు.
⇒ ఈ గణాంకాల ప్రకారం, 519 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలలో అధిక బి.ఎం.ఐ ఉన్నవారి సంఖ్యలో భారతదేశం ఇప్పుడు అమెరికాను కూడా దాటేసింది. ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలే ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags : 1