Breaking News

భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం!

Published on Wed, 09/27/2023 - 10:20

బ్రహ్మచారులు, సాధువుల కన్నా సంసార జీవితాన్ని గడిపే వారికే కొన్ని దాన ధర్మాలు నిర్వర్తించే అవకాశ ముంది. వాళ్లను సాయం అడిగే వారుంటారు. అలాంటి వారికి సాయం చేసి పుణ్యం గడించే వీలు వీరికే ఎక్కువ. సంసారి తన దగ్గర ఉన్నవాటిని ఎవరెవరికి ఏది అవసరమో వాటిని నిండు మనసుతో ఇవ్వాలి. ఏ మేరకు ఇవ్వగలరో ఆ మేరకు ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వాటిలో ముఖ్యమైనది.

కడుపునిండా అన్నం పెట్టిన మనిషి ముఖాన్ని చూడండి. అతని ముఖంలో ఓ తృప్తీ, ఓ ఆనందం కనిపిస్తాయి. కానీ మిగిలిన దానాల విషయంలో ఈ తృప్తి అంతగా కనిపించదు. ఎవరైనా తినడానికి వస్తున్నారేమోనని చూసిన తర్వాత తినాలనేది భారతీయ సంప్రదాయం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పెట్టక తానే తినడం, ఇతరు లకు తెలీకుండా దాచిపెట్టి తినడాన్ని పాపమనే భావనా ఉంది.

అందుకే అంటారు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా దానం చేయడం ముఖ్యం. అందులోనూ ‘అన్నదానా’న్ని మించింది మరొకటి లేదు. ఓ ధనవంతుడు ఎన్నో పూజలు చేసి, భగవంతుడిని ఆరాధించి ఇక తానెవరికీ ఏదీ చెయ్యవలసిన అవసరం లేదని నిర్ణయించుకుని తన దగ్గరున్నది ఎవరికీ ఇవ్వక, ఎవరికీ పిడికెడు అన్నం కూడా పెట్టక ‘తానూ, తన కుటుంబం’ అనుకొని బతికాడు.

తీరా ఆయన మరణిం చాక రాక్షసుడిగా మారి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే శవాలను పీక్కుతింటూ తన తప్పు తాను తెలుసుకుని తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు. దీంతో రాక్షస రూపం పోయి సద్గతి పొందినట్లు ఓ కథ ఉంది. ఇటువంటి కథల నుంచి గ్రహించాల్సిన నీతి ఒక్కటే: తాను తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి. 
 – యామిజాల జగదీశ్‌ 

(చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)