Breaking News

ఇవి తిందాం.. ఉత్సాహంగా ఉందాం!

Published on Sat, 07/06/2024 - 08:15

నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన  సొంతం అవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ అవేమిటో చూద్దామా?

టొమాటో... దీనిలోని లైకోపిన్‌ కాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.

బెర్రీస్‌... అన్ని రకాల బెర్రీస్‌... ముఖ్యంగా నేరేడుపండ్లు: వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్‌ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్‌ నిరోధకాలు ఉంటాయి.

యోగర్ట్‌ లేదా పెరుగు: ప్రోటీన్, కాల్షియం, విటమిన్‌–బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్‌ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్‌ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్‌ బారిన పడకుండా కాపాడుతుంది.

బీన్స్‌....ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్‌. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్‌ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.

గ్రీన్‌ టీ... ఇది ఓ సూపర్‌ డ్రింక్‌. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్‌ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.

ఆకుకూరలు... ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్‌ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్‌ బి, సి, ఇ, ఫోలేట్, పోటాషియం, పీచుపదార్ధం  సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. అందుకే తిందాం... ఉత్సాహంగా ఉందాం.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)