Breaking News

నాడు కాలేజ్‌ డ్రాపౌట్‌..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటు..!

Published on Sun, 03/29/2026 - 12:58

కొందరికి ఈ చదువులు తనకేం ఉపయోగపడవని, ఇంకేదో రంగంలో ఎదగగలం అని ముందుగానే గుర్తిస్తారు, బలంగా నమ్ముతారు కూడా. అంతేగాదు చాలా ధైర్యంగా చదువుకి మధ్యలోనే స్వస్తి పలికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ రంగంలో దూసుకుపోవడమే కాదు మంచి గుర్తింపు, పేరు తెచ్చుకుంటారు కూడా. అలాంటి కోవకు చెందినవాడే ఈ పిజిక్స్‌ వాలా. ఆయన ఒకప్పడూ కాలేజీ డ్రాపౌట్‌..ఇవాళ ఎవ్వరూ ఊహించనంత స్థాయి చేరుకోవడమే కాదు..ఏకంగా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా చోటు దక్కించుకున్నాడు. 

అతడే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలఖ్ పాండే. ఆయన ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరంలోనే చదువు మానేశారు. ఆ తర్వాత చాలాకాలం ప్రైవేట్‌ ట్యూటరింగ్‌గా తక్కువ జీతానికి పనిచేసేవారు. అలా సాగుతున్న టైంలో 2016లో పిజిక్స్‌ వాలాగా ఉచితంగా సులభంగా పాఠాలు బోధిస్తూ వేలాది మంది విద్యారులను సంపాదించుకోవడంతో అతడి జీవితం కీలక మలుపు తిరిగింది. 

ఆ తర్వాత అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ అనే వ్యక్తితో కలిసి 2020లో 'ఫిజిక్స్‌వాలా' అనే ఎడ్‌టెక్ సంస్థను స్థాపించారు. కొద్దికాలంలోనే ఆ కంపెనీ ఓ ప్రభంజనంలా దూసుకుపోయింది. నిజానికి అధిక ఫీజలు చెల్లించకుండా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. దాంతో అలాంటి విద్యార్థులను ఉద్దేశించి సులభంగా అర్థం చేసుకునే బోధనా శైలిని రూపొందించారు. ఎడ్‌టెక్‌ అనే స్థార్టప్‌ సాయంతో దూసుకుపోయారు. మొదట్లో ఆ కంపెనీ ఉద్యోగ కోతలు, నష్టాలు, పెట్టుబడుదారుల సందేహాలతో సతమతమవుతున్న తరుణంలో పాండే తన కంపెనీని వృద్ధికి అందుబాటు ధరలో విద్యును అందించడమే కేంద్రబిందువుగా చేసుకున్నారు. 

అలా 2024లో ఫిజిక్స్‌వాలా సిరీస్ బి రౌండ్‌లో దాదాపు రూ. 1750 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత మార్చి 2026 నాటికి అలఖ్‌ పాండే నికర ఆస్తి విలువ సుమారు రూ. 9 వేల కోట్లుకు చేరుకుందని అంచనా. దాంతో ఆయన ఫోర్బ్స్‌ 2026 బిలియనీర్ల జాబితాలో 3332వ స్థానంలో ప్రవేశించారు. ఒకప్పుడు పాఠం పాఠంగా చెబుతూ అభిమానులను సపాదించుకున్న ఆ ఉపాధ్యాయుడు కొద్దిమంది వ్యవస్థాపకులు మాత్రం చోటు దక్కించుకునే సంపాదన స్థాయికి చేరుకోవడం విశేషం. 

ఈ స్థాయికి ఎలా చేరుకున్నారంటే..
పాండే తన స్టార్టప్‌ విధానానికి విరుద్ధంగా విస్తరణపైనే దృష్టిసారించి లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తక్కువ ఖర్చుతో బోధించడంతో విశేష ఆదరణ సంపాదించకున్నారు. పాండే కథ డిజిటల్‌ విప్లవం విద్యా అవకాశాల స్వరూపాన్ని ఎలా మార్చేసిందే చెబుతోంది. 

ఒక చిన్న పట్టణంలోని విద్యార్థి విద్య నేర్చుకోవడాని అతని కోసం మెట్రో నగరానికి వెళ్లాల్సిన పనిలేదు.  పైగా అధికమొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఒక్క ఫోన్‌ స్క్రీన్‌ చాలు. అందువల్ల అతడు బిలియనీర్ల జాబితాలో సులభంగా చోటు దక్కించుకోగలిగాడు. అందుబాటు ధరలో మార్కెట్‌ను సొంతం చేసుకునే వ్యాపార సూత్రం కూడా.  

(చదవండి: డెవర్లే... రైతులుగా...)

 

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)