Breaking News

పీసీఓఎస్‌ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?

Published on Wed, 09/11/2024 - 17:17

ప్రస్తుత జీవన విధానంలో టీనేజ్‌ అమ్మాయిల దగ్గర నుంచి వివాహిత మహిళల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పీసీఓఎస్‌. దీని కారణంగా మహిళలు పడే బాధ అంత ఇంత కాదు. అయితే అందుకోసం చాలామంది పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. నిజానికి పీసీఓఎస్‌ సమస్య ఉంటే పాల ఉత్పత్తులు నివారించాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. నిక్షేపంగా వాటిని తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సెప్టెంబర్‌ నెల పీసీఓఎస్‌ అవగాహన నెల సందర్భంగా దీని గురించి సవివరంగా తెలుసుకుందాం.!

పీసీఓస్‌ అంటే..
పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోమ్‌ లేదా పీసీఓఎస్‌ అనేది ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత. ఇది కొందరిలో గర్బందాల్చే ప్రక్రియను ‍ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో అండోత్సర్గం జరగకపోవచ్చు లేదా ఆండ్రోజెన్ల స్థాయి(పురుష హార్మోన్లు) పెరగడం లేదా అండాశయాలపై చిన్న తిత్తులు రావడం జరుగుతుంది. కొందరికి పిరియడ్స్‌ అసంబంధంగా(ఇర్‌రెగ్యులర్‌)గా ఉండటం, బరువు పెరగటం, ముఖంపై వెంట్రుకలు, మొటిమలు, జిడ్డుగల చర్మం తదితర సమస్యలు ఎదురవుతాయి. 

డైట్‌తో సంబంధం..
అధిక-కార్బోహైడ్రేట్, కొవ్వు ఆహారాలు, తక్కువ-ఫైబర్ ఆహారాలు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌తో కూడిన పాశ్చాత్య ఆహారాలు పీసీఓఎస్‌ సమస్యను పెంచే ప్రమాద కారకాలు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌ వంటివి పీసీఓస్‌ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే. ఇక్కడ డైరీ ఉత్పత్తులు పీసీఓఎస్‌ సమస్యను పెంచుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు.

డైరీ ఉత్పత్తుల్లో సంతృప్తకొవ్వులు కూడా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవాలని అన్నారు. అయితే కొందరికి లాక్టోస్‌ అసహనం ఉంటుంది. అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులు తీసుకుంటే అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా మొత్తం ఆరోగ్యాన్నే ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి అలాంటి వాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మేలని చెప్పారు. 

లాక్టోస్‌ అసహనం లేనట్లయితే చక్కగా పెరుగు, మజ్జిగ రూపంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్‌లు శరీరానికి అందడమే కుండా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు డైట్‌లో మార్పులు చేసుకునే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాలను తీసుకుని పాటించటం మంచిదని చెబుతున్నారు అమిత గాద్రే.

 

(చదవండి: యూట్యూబర్‌ వెయిట్‌ లాస్‌ జర్నీ: జస్ట్‌ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!)

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)