Breaking News

ఫ్రిజర్‌లో మంచుకొండలా ఐస్‌ పేరుకుపోతుందా?

Published on Wed, 10/11/2023 - 09:43

ఫ్రీజర్‌లో చిన్నచిన్న మంచుకొండలా ఐస్‌ పేరుకుపోతుంది. ఇలా గడ్డకట్టిన ఐస్‌పైన కొన్ని ఆహార పదార్థాలు పెడితే పాడవుతాయి. ఐస్‌ ఒకపట్టాన కరగదు. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్య తీరిపోతుంది.

కొండలా ఉన్న మంచు మాయం కావాలంటే..

👉: రిఫ్రిజిరేటర్‌ పవర్‌ స్విచ్‌ ఆపేసి గడ్డకట్టిన ఐస్‌ను కరిగించాలి.

👉: ఇప్పుడు బంగాళదుంపను  శుభ్రంగా కడిగి రెండు ముక్కలు చేయాలి. రెండు ముక్కలతో ఫ్రీజర్‌ ర్యాక్స్‌ను రుద్దాలి. మూలల్లో కూడా జాగ్రత్తగా రుద్దాలి. ఇలా చేస్తే ఫ్రీజర్‌లో త్వరగా మంచు ఉండలు ఏర్పడవు.

👉: అవసరాన్ని బట్టి రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతలను మార్చుకుంటూ ఉంటే ఐస్‌ ఏర్పడదు.

👉: ఫ్రీజర్‌లో అతిగా ఆహార పదార్థాలను పెట్టకూడదు. ఎక్కువ మొత్తంలో వస్తువులు పెడితే ఐస్‌ ఏర్పడడానికి ఖాళీ ఉండదని కుక్కేస్తుంటారు. ఫ్రీజర్‌లో ఎంత ఎక్కువమొత్తంలో వస్తువులు ఉంటే అంత ఎక్కువ తేమ ఏర్పడి ఐస్‌గా మారుతుంది.

👉: చాలామంది ఇంటిని శుభ్రం చేస్తుంటారు కానీ రిఫ్రిజిరేటర్‌ను పెద్దగా పట్టించుకోరు. కనీసం పదిరోజులకొకసారి స్విచ్‌ ఆపేసి, లోపల ఉన్న పదార్థాలను బయటపెట్టి శుభ్రం చేస్తే ఐస్‌ సమస్య అంతగా ఉండదు. గార్డెన్‌లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే...

👉: అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్‌ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. ∙అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్‌లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ∙ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. ∙పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ∙ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ∙ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గిపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది.

(చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్‌ ఐదు గ్రాములే చాలట!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)