సహజ మెరుపుని అందించే 'ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌'

Published on Sun, 03/22/2026 - 15:18

ఎండ వేడి, కాలుష్యం, ఒత్తిడి వంటి వివిధ కారణాలతో చాలామందిలో నల్లటి మచ్చలు, ముఖం మీద సన్నని రంధ్రాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో ముఖం నిస్తేజంగా మారుతుంది. 

ఇటువంటి సమయంలో ముఖంలోని సహజ మెరుపును తిరిగి పొందేందుకు చాలా మంది పార్లర్లకు వెళుతుంటారు. అయితే చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చుకునేందుకు ఈ ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌ సాయపడుతుంది. ఇది చర్మాన్ని చల్లగా మార్చి తాజాగా ఉంచుతుంది. దీని సాయంతో ఎటువంటి రసాయనాలు లేకుండానే ఇంట్లోనే సహజమైన నిగారింపు పొందవచ్చు.

ఐస్‌ క్యూబ్‌లను నేరుగా ముఖానికి రాసుకుంటే చర్మం ఎర్రగా మారడం, మంట, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌ ఉపయోగిస్తే చల్లని స్పర్శ ముఖం అంతటికి సమానంగా అందుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం సహజంగా కాంతిమంతంగా మారుతుంది. చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు రావు. 

ఈ పరికరంతో సున్నితంగా మసాజ్‌ చేస్తే చర్మంపై ఏర్పడిన సన్నని రంధ్రాలు తగ్గి, చర్మం నునుపుదేరుతుంది. కళ్ల కింద వాపు, ముఖంపై అలసట మటుమాయం అవుతాయి. ఎండ ధాటికి చర్మం వడలిపోయే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు కూడా ఈ మసాజర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మసాజర్‌ను ఉపయోగించడం చాలా తేలిక. మసాజర్‌లో నీటిని నింపి ఫ్రీజర్‌లో ఉంచాలి. 

నీరు గడ్డకట్టిన తర్వాత ముఖంపై మసాజ్‌ చేస్తే చాలు, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మసాజర్‌ కేవలం అందాన్ని పెంచడమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పోర్టబుల్‌ సైజులో ఉండటంతో ఉపయోగించడం చాలా సులభం. తక్కువ ఖర్చుతో, ఎలాంటి రసాయనాలు లేకుండా ముఖాన్ని మెరిపించుకునేందుకు ఈ ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌ మంచి ఎంపికనే చెప్పుకోవాలి. ఆన్‌లైన్‌లో లభిస్తున్న ఈ పరికరం ధర కేవలం రూ. 2,299 మాత్రమే.

(చదవండి: పక్షవాతానికి వార్నింగ్‌ బెల్‌..!)

 

Videos

అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు

హెచ్-1బీ వీసా కష్టాలు.. కరిగిపోతున్న అమెరికా కలలు

ఖతార్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?

వెనుక ఉండి నక్కి నక్కి చూస్తున్నాడు.. ఇప్పుడు అర్థమైందా నీ స్థాయి BR నాయుడు..

పెట్రోల్ రేటు పెంపు? చమురు కొరతపై మోదీ రివ్యూ మీటింగ్..

రెచ్చిపోయిన సీఎం రమేష్.. బంజారా హిల్స్ లో భూకబ్జాకు యత్నం

అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్

సిద్ధమైన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏక్షణమైనా దాడి చేసే ఛాన్స్..

యూట్యూబర్ వైష్ణవి భర్తకు తీవ్ర అస్వస్థత

Photos

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)