సివిల్స్‌లో మూడుసార్లు ఓటమి..! మూడేళ్లు మొబైల్‌ లేకుండా..

Published on Tue, 07/01/2025 - 17:31

సివిల్స్‌ విజేతల గాథలు ఎప్పటికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అందులో గెలుపొందడం అనేది అసాధారణమైనది. దశల వారిగా నెగ్గుకుంటూ రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్‌లో ఏ దశలో తప్పినా..మళ్లా మొదటి నుంచే రావాలి. అలాంటి కఠినతరమైన ఎగ్జామ్‌లో గెలవడం అనేది యువతకు అతిపెద్ద డ్రీమ్‌. దాన్ని సాధించే క్రమంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, చేసిన త్యాగాలు వింటే విక్టరీ కోసం తపన ఇలా ఉండాలా అనే ప్రేరణను కలుగజేస్తాయి. అలాంటి కోవకు చెందిందే రాజస్థాన్‌కి చెందిన నేహా బయాద్వాల్. తండ్రిలానే ప్రభుత్వం ఉద్యోగం పొందాలని సివిల్స్‌ ఎంచుకుంది. ఆ క్రమంలో ఆమె వరుస ఓటములు ఎదురైనా.. వెనుదిరగక చావో రేవో అనేలా కష్టపడింది. చివరికి తన కల సాకారం చేసుకుంది. మరీ ఆమె సక్సెస్‌ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!.

రాజస్థాన్‌కి చెందిన నేహా బయాద్వాల్‌ బాల్యంమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే సాగింది. ఆమె తొలిసారి వైఫల్యం చూసింది ఐదోతరగతిలో. ఎందుకంటే తన తండ్రికి భోపాల్‌ ట్రాన్స్‌ఫర్‌ కావడంతో అక్కడ స్కూల్‌లో ఐదోతరగతి చదవాల్సి వచ్చిందట. అయితే అక్కడ కేవలం ఇంగ్లీష్‌లో మాట్లాడాలట. పొరపాటున హిందీలో మాట్లాడితే జరిమానా విధిస్తారట. దీంతో భాషాపరమైన ఓటమిని తొలిసారిగా చవిచూశానని చెప్పుకొచ్చింది. 

ఎట్టకేలకు అందులోనే నైపుణ్యం సంపాదించి శెభాష్‌ అనిపించుకున్నట్లు కూడా తెలిపింది. ఆమె తండ్రి సీనియర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారి కావడంతో ఆయన అడుగుజాడల్లోనే వెళ్లాలని నిశ్చయించుకుని యూపీఎస్సీకి సిద్ధమైంది. అయితే వరుసగా మూడుసార్లు ఓటముల చవిచూడగా చిర్రెత్తికొచ్చి..మొబైల్‌కే దూరంగా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయిపోయిందట. అలా మూడేళ్లు ఫోన్‌కి దూరంగా ఉంటూ..ఆహర్నిశలు కష్టపడి చదివింది. 

అంతేగాదు ఆమె రోజుకు సుమారు 17 నుంచి 18 గంటలు చదివేదట. చివరికి తన డ్రీమ్‌ని సాధించి ఐఏఎస్‌ అధికారి అయ్యింది. ఇక నేహా మాట్లాడుతూ..పిల్లల కోరికలను తీర్చడమే త్యాగం కాదని, ఎంత బిజీగా ఉన్న పిల్లల ఆలనాపాలనా పట్టించుకుంటూ..వారికి చదువులో సాయం చేయడమే నిజమైన త్యాగం అని అంటోంది. తన తండ్రి ఎంత బిజీగా ఉన్నా..ఇంటికి రాగానే తనకు కనీసం 30 నిమిషాలు గణితం బోధించడానికి సమయం కేటాయించేవారని అంటోంది. 

అలాగే ఈ ఐఏస్‌ కలనే నెరవేర్చుకోవడలంలో మొత్తం కుటుంబమే తోడ్పాటును అందించిందని చెప్పుకొచ్చింది. చివరగా నేహా..ఈ ఐఏఎస్‌ ప్రిపరేషన్‌లో ఎదురయ్యే ఓటములు కసిసి పెంచి, టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పించడం తోపాటు వివేకంతో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుందని చెబుతోంది.   

(చదవండి:  పుట్టగొడుగులను అలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు నిల్‌..! నిపుణుల షాకింగ్‌ విషయాలు..)

 

Videos

సింహం సింగిల్ గా వస్తుంది

పవన్ నోటా EVM కుట్ర..!

పవన్ కళ్యాణ్ ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు

ఉగ్రవాదులకు హర్రర్ పిక్చర్.. పాక్ పై భారత్ మరో ఆపరేషన్

ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్

అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం.. 24 మంది చిన్నారులు మృతి

తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టిన పెద్దారెడ్డి

మొదలైన ప్రళయం? జపాన్ లో హైటెన్షన్

2029 ఎన్నికలపై నోరు జారిన పవన్

పేదల రేషన్ దోపిడీ.. సాక్షాలతో బయటపెట్టిన అభినయ్ రెడ్డి

Photos

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)

+5

చినుకుల్లో డార్జిలింగ్‌ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!