Breaking News

భయపెట్టే పాత్రలు కావాలి..

Published on Sun, 01/25/2026 - 05:41

తెరపై కనిపించే అనూ ఇమాన్యుయేల్‌ కేవలం పాత్ర మాత్రమే!నిజమైన ‘నేను’ మేకప్‌ తీసేసిన తర్వాత, నిశ్శబ్దంలోనే కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు, ఆమె మాటల్లోనే మీకోసం.. 

» నా బాల్యం సాధారణంగానే గడిచింది. షికాగోలో పుట్టి, గార్లాండ్, టెక్సాస్‌లో పెరిగాను. కేరళలోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, 2011లో మలయాళం సినిమా ‘స్వప్న సంచారి’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాను. కాని, అదే నా గమ్యం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత చదువు కోసం మళ్లీ అమెరికాకు వెళ్లిపోయాను.

»  సైకాలజీ డిగ్రీ చదువుతూ, మనసులు చదవడం నేర్చుకుంటున్నప్పుడు, నా మనసు ఇంకొక దారి చూపింది. కెమెరా మళ్లీ పిలిచింది. ‘యాక్షన్‌ హీరో బిజు’తో లీడ్‌ హీరోయిన్ గా కెమెరా ముందుకు వచ్చాను. ఆ రోజు భయం, ఉత్సాహం ఉంది. అంతకన్నా ఎక్కువగా కొత్త జీవితంలో అడుగుపెట్టినట్లు అనిపించింది.

» ‘మజ్ను’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టాక నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. కొత్త భాష, కొత్త ముఖాలు, కొత్త అంచనాలు. అమెరికాలో పెరిగిన అమ్మాయిగా, ఇక్కడ నన్ను నేను మళ్లీ నిరూపించుకోవాల్సి వచ్చింది. అదే నన్ను మరింత స్ట్రాంగ్‌ చేసింది.

» పింక్‌ కలర్‌ నా ఫేవరెట్‌. అది ట్రెండ్‌ కాదు. పింక్‌ చీర కట్టుకున్నప్పుడు నన్ను నేను బెస్ట్‌గా ఫీల్‌ అవుతాను. ఒకరకమైన ప్రశాంతత, కాన్ఫిడెన్స్ రెండూ కలిసి వస్తాయి.

» లాంగ్‌ డ్రైవ్స్‌ అంటే నాకు ఇష్టం. డ్రైవింగ్‌ చేస్తూ రోడ్ల మీద వెళ్లడం, డెస్టినేషన్‌ ముందే నిర్ణయించుకోకుండా దారి మళ్లించడం. అదే నా థెరపీ. అలా ఆ ప్రయాణాల్లోనే నేను నాతోనే ఎక్కువగా మాట్లాడుకుంటాను.

» షూటింగ్‌ లేనప్పుడు నా ప్రపంచం చాలా సింపుల్‌. పుస్తకాలు చదువుతూ, బ్యాలే డ్యాన్స్ చేస్తూ చాలా సైలెంట్‌గా ఉంటాను. నిశ్శబ్దం నాకు భయం కాదు. అదే నాకు స్పేస్‌ ఇస్తుంది.  

» తెరపై నేను చాలా కామ్‌గా కనిపిస్తాను. అది నా ప్రొఫెషనల్‌ ఫేస్‌ మాత్రమే. నన్ను దగ్గరగా తెలిసినవాళ్లకు తెలుసు – నేను చాలా ఎనర్జిటిక్, కొంచెం క్రేజీ కూడా.

» ‘గర్లఫ్రెండ్‌’ సినిమాలో దుర్గ పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. కాస్త అమెరికన్‌ యాక్సెంట్‌ నాకు సహజంగా అనిపించింది. దాన్ని దాచాలని అనుకోలేదు. ఆ పాత్రకు అదే నిజం అనిపించింది. 

» గాసిప్స్, రూమర్స్‌ ఒకప్పుడు ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా అల్లు శిరీష్‌తో వచ్చిన వార్తలు. ఇప్పుడు వాటిని చిరునవ్వుతో వదిలేయడం నేర్చుకున్నాను. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని అర్థమైంది.

» నాకు ఇప్పుడు లుక్స్‌ కోసం పాత్రలు కాదు. లోతున్న పాత్రలు కావాలి. నన్ను భయపెట్టే పాత్రలు కావాలి. కంఫర్ట్‌ జోన్ లోనే ఉండాలని లేదు.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)