Breaking News

సందడిగా హెచ్‌పీఎస్‌ 101వ వార్షిక క్రీడోత్సవం

Published on Sat, 11/30/2024 - 07:03

సనత్‌నగర్‌ : బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) 101వ వార్షిక క్రీడోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హెచ్‌పీఎస్‌ ఆవరణలోని ఫ్రంట్‌ ఫీల్డ్‌లో అట్టహాసంగా నిర్వహించిన క్రీడా సంబరాల్లో వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఆయా క్రీడల్లో సత్తా చాటారు. హెడ్‌బాయ్‌ శాని్వసాగి, హెడ్‌బాయ్‌ సార్తక్‌ లాంబా నేతృత్వంలో పాఠశాలలోని తక్షశిల, నాగార్జున, నలంద, విజయనగర బృందాలు అద్భుతరీతిలో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు విద్యార్థులు కేరింతల నడుమ క్రీడాకారులు విజయం సాధించి తమ బృందానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టేందుకు పోటీపడారు. 

సీనియర్‌ బాలురు, బాలికల 100 మీటర్ల పరుగు పందెంలో విజయనగర హౌస్‌కు చెందిన రుత్విక్‌ వూవాదన్, ఎస్‌ఎస్‌ సమితరెడ్డిలు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌కు చెందిన విద్యార్థులు గుర్రాలపై విన్యాసాలు చేసి అలరించారు. ఏరోబిక్స్‌ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. అనంతరం 6, 7 తరగతులకు చెందిన 690 మంది విద్యార్థులు ‘టాలోన్స్‌ ఆఫ్‌ ట్రయంఫ్‌’ పేరుతో ఆకర్షణీయమైన ప్రదర్శన ఇచ్చారు. పర్పుల్‌ అండ్‌ వైట్‌ దుస్తులు ధరించిన విద్యార్థులు రిబ్బన్లతో అదిరిపోయే సింఫనీని సృష్టించారు. 

3, 4, 5 తరగతులకు చెందిన 981 మంది విద్యార్థులు ఆక్స్‌ఫర్ట్‌ అండ్‌ కేంబ్రిడ్జి బ్లూస్‌ ధరించి ‘ఫ్యూజన్‌ ఫిట్‌నెస్‌’ పేరుతో కాలిస్టెనిక్స్‌ పరిపూర్ణ ప్రదర్శన వీక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. 8, 9 తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన ‘వైబ్రెంట్‌ వైబ్స్‌’ డీల్‌ అబ్బురపరిచింది. క్రీడలు, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్యోతిక శ్రీదండి ట్రోఫీలు, జ్ఞాపికలను ప్రదానం చేశారు.  హెచ్‌పీఎస్‌ ప్రిన్సిపాల్‌ స్కంద్‌బాలి, సొసైటీ ప్రతినిధులు, ఆధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.  

క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేలా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపించాలి. హెచ్‌పీఎస్‌ క్రీడోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవడం నా అదృష్టం. విద్యార్థులు వైఫల్యానికి భయపడవద్దు. క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. అంకితభావం, పట్టుదలతో సాధించలేనిది ఏదీ ఉండదు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. 
– ఒలింపిక్స్‌ జాతీయ చాంపియన్‌ (స్ప్రింటింగ్‌) జ్యోతిక శ్రీదండి  

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)