Breaking News

ఆర్టిస్టిక్ .. ప్రేమ్‌..ఫ్రేమ్‌..

Published on Sat, 02/08/2025 - 09:01

నగర రహదారుల్లోని గోడలు, అండర్‌ పాస్‌ వంతెనలు, ఫ్లై ఓవర్లు అద్భుతమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు, అటుగా వెళ్లే ప్రయాణికులను ఈ గోడ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణంలో పలు చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్‌ ఇస్రమ్‌ ఫ్రేమ్స్‌ నగరానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ములుగు జిల్లా గిరిజన తాండా నేపథ్యంలో ఈ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థి చిత్రాలు నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. 

ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ రోడ్లు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. రంగు రంగుల చిత్రాలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు ఫైన్‌ ఆర్ట్స్‌ కళాకారులు గోడలపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీని కోసం దాదాపు 149 కోట్ల నిధులతో రోడ్లు, కూడళ్లు, వీధులను ప్రత్యేకంగా, అత్యంత సుందరంగా మారుస్తున్నారు. నగరానికి తలమానికమైన హైటెక్‌ సిటీ, కొండాపూర్, ఇతర ప్రధాన రహదారులు అందమైన పెయింటింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్, హైటెక్‌ సిటీ వంటి ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు, స్ట్రీట్‌ ఆర్ట్‌లో ఓ యువకుడి కళాత్మకత కృషి దాగి ఉంది. మాసబ్‌ ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూ వేదికగా ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసిన ప్రేమ్‌ ఇస్రమ్‌ (27) కొన్ని ఫ్లై ఓవర్లకు అత్యాధునిక టెక్నాలజీని 
ప్రతిబింబించే రంగుల చిత్రాలతో హంగులను అద్దాడు.

నాలుగు ఫ్లై ఓవర్లు.. 
హైటెక్‌ సిటీ నుంచి కూకట్‌పల్లి మార్గంలోని ఫ్లై ఓవర్‌పై సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, అధునాతన సాంకేతికత, ఈ తరం అధునాతన ఆలోచనలు ప్రతిబింబించే చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దీనికి సమీపంలోని అయ్యప్ప సొసైటీ – 100 ఫీట్‌ రోడ్‌ అండర్‌ పాస్‌లో ‘బజార్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ థీమ్‌తో వేసిన పెయింటింగ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటన్నింటినీ తన బృందం (15 నుంచి 20 మంది)తో పూర్తి చేశానని, వీరందరూ కూడా తనతో చదువుకున్న జూనియర్స్, ఆర్ట్‌ ఫ్రెండ్స్‌ అని ప్రేమ్‌ తెలిపారు. ఒక ఫ్లై ఓవర్‌పూర్తి చేయడమే కష్టతరమైన నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణంలో నాలుగు ఫ్లై ఓవర్లు కళాత్మకంగా సుందరీకరించానని పేర్కొన్నాడు. కొత్తగూడ అండర్‌పాస్‌లో ఇండియన్‌ ఆర్మీ లైఫ్‌స్టోరీని, అదే ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై అడ్వెంచర్, ట్రావెలింగ్‌కు సంబంధించిన పెయింటింగ్స్‌ వేశానని వివరించారు.

హాబీగా మొదలై.. 
ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని నార్లపూర్‌ అనే మారుమూల గ్రామం మాది. చిన్నప్పుడు ఆర్ట్‌ పై పెరిగిన మక్కువ ఈ ప్రయాణానికి కారణం. చిన్నతనంలో సమీపంలోని రోడ్లపై చాక్‌పీస్‌తో పెద్ద పెద్ద బొమ్మలు వేసి సంతోషపడే వాడిని. అదే హాబీగా మారి నగరాన్ని అందంగా మార్చే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ఆయిల్‌ పెయింటింగ్‌ పోట్రేట్స్‌ వేయడంలో అనుభవజు్ఞడిని.. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక అంశాలతో స్ట్రీట్‌ ఆర్ట్‌ వేశాను. నగరంలోని నెహ్రూ ఆర్ట్‌ గ్యాలరీలో నా మూలాలైన ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై వేసిన పెయింటింగ్స్‌తో ‘వేరియస్‌ ఇంప్రెషన్స్‌’ అనే ప్రత్యేక ప్రదర్శన చేశాను.  
– ప్రేమ్‌ ఇస్రమ్, ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థి

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)