Breaking News

కాస్‌ ప్లే వేదికగా కామిక్‌ కాన్‌ 2024

Published on Wed, 11/06/2024 - 07:53

అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన ప్రతి కళనూ, సృజనాత్మకతను, అధునాతన హంగులను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్‌ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే గ్లోబల్‌ వేదికగా ప్రసిద్ధి చెందిన కాస్‌ ప్లేను నగరానికి పరిచయం చేయడంలో భాగంగా  ప్రతిష్టాత్మక ‘కామిక్‌ కాన్‌ 2024’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.  

సిటీలోని హైటెక్స్‌ వేదికగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో కామిక్‌ కాన్‌ కాస్‌ ప్లే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్‌లో కామిక్‌ కాన్‌ ఫేం సౌరభ్‌ సింగ్‌ రావత్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి కాస్‌ ప్లే సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. గత కొంత కాలంగా నగరంలో కూడా కాస్‌ ప్లే ప్రత్యేక ఆదరణ పొందడమే కాకుండా దీని కోసం ఫ్యాన్‌ బేస్‌ కూడా పెరుగుతోంది. సిటీలో కూడా జోహైర్‌ ఖాన్‌ వంటి పలువురు కామిక్‌ కాన్‌ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ది హైదరాబాద్‌ కాస్‌ ప్లేయర్స్‌ క్లబ్‌ నిర్వాహకులలో ఒకరు స్థానికంగా జరగనున్న కామిక్‌ కాన్‌ ఫెస్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 

ఫ్యూచర్‌ ఫేం కాస్‌ ప్లే.. 
నగరంలో కామిక్‌ ఫెస్ట్‌ జరగనున్న నేపథ్యంలో కాస్‌ ప్లేలో భాగస్వామ్యం పంచుకునే వారికి స్పైడర్‌ మ్యాన్, బ్యాట్‌ మ్యాన్‌ వంటి విభిన్న డిజైన్‌ మేకింగ్, క్రియేటివ్‌ ఆర్ట్‌ వర్క్స్‌ రూపొందించడం ప్రధానాంశం. ఈ క్రియేటివిటీ పైన అవగాహన కలి్పంచడం కోసం కొన్ని రోజుల క్రితమే కామిక్‌ కాన్‌ ఫేం సౌరభ్‌ సింగ్‌ రావత్‌ నగరంలో కాస్‌ ప్లే వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఉర్పీ జావేద్‌ వంటి ప్రముఖుల కోసం ఐకానిక్‌ కాస్ట్యూమ్‌లను రూపొందిస్తూ, టాప్‌ గ్లోబల్‌ బ్రాండ్‌లతో సౌరభ్‌ పని చేస్తుండటం విశేషం. ఈ వర్క్‌షాప్‌లో నగరంలోని ఔత్సాహికులు పాల్గొని ఆకర్షణీయ కాస్‌ ప్లే కళపై పట్టు సాధించారు. 

సాధారణ వస్తువులు వినియోగించి.. 
సాధారణ వస్తువులు వినియోగిస్తూ కాస్‌ ప్లే డిజైనింగ్, ఆర్ట్‌ వర్క్‌ పై అవగాహన పెంచుకున్నారు. అయితే నగరంలో స్పోర్ట్స్, సినిమాలు, ఫ్యాషన్, గేమింగ్‌ తరహాలో కాస్‌ ప్లే కూడా తన భవిష్యత్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందనడానికి ‘కామిక్‌ కాన్‌ 2024’ వంటి ఈవెంట్స్‌ నిదర్శనంగా నిలుస్తున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)