Breaking News

వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!

Published on Fri, 12/13/2024 - 17:49

బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్‌బ్యాక్‌ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. 

ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్‌ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి  ఆఫ్రికాలోని జాంజిబార్‌లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు.  తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్‌బ్యాక్‌ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్‌బ్యాక్‌ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.

అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్‌బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్‌బ్యాక్‌ తిమింగలం కదలికలను ట్రాక్‌ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.

మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు. 

వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్‌బ్యాగ్‌ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్‌ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. 

(చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్‌'తో అంతలా బరువు తగ్గొచ్చా..!)
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)