Breaking News

విదేశీ ప్రయాణంలో మందులు ఎలా ప్యాక్‌ చేసుకోవాలి?

Published on Mon, 06/15/2026 - 02:46

ఇంటి నుంచి ఫోన్‌ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల  విషయంలో సరైన ప్లానింగ్‌ లేకుండా వెళ్లకూడదు. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు విషయంలో ప్రతీ దేశానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. మన దేశంలో ప్రతీ మెడికల్‌ షాపుల్లో ఉంటే కొన్ని మందులు విదేశాల్లో అసలు లభించకపోవచ్చు. లేదా చట్టవిరుద్ధం అయి ఉండొచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ప్లాన్‌ చేయడం మొదలు పెట్టాలి. దాని కోసం ఈ కింది అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.

వైద్యుల సలహా తప్పనిసరి
అన్నింటికన్నా ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించి విదేశీ ప్రయాణం గురించి చెప్పండి. మీ ఆరోగ్య సమస్యల చరిత్ర మొత్తం వారికి తెలుసు కాబట్టి మీ డెస్టినేషన్, ప్రయాణ సమయాన్ని బట్టి మీకు వ్యక్తిగతంగా ప్రిస్క్రిప్షన్‌ రాసి ఇస్తారు.

మందుల పేర్లు 
ఇది చాలా తేలికైన పని. మీరు రెగ్యులర్‌గా వాడే మందుల జెనరిక్‌ నేమ్, మోతాదు, ఫ్రీక్వెన్స్  వంటివి నోట్‌ చేసుకోండి. మొత్తం ట్రిప్‌కు సరిపడా మందులను ప్యాక్‌ చేసుకోండి.

తప్పకుండా తీసుకెళ్లాల్సినవి
⇒ మీరు చదవబోయే ఈ కింది మందులు అనేవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయో తెలియదు. కానీ వీటిని క్యారీ చేయడం మంచిది. అయితే మీ లిస్టు రెడీ చేసుకుని మీ వైద్యుడికి చూపించడం మరవకండి.
⇒ పెయిన్‌ కిల్లర్స్, అలర్జీ మందు, జీర్ణ శక్తి పెంచే మందులు, జలుబు, దగ్గు మందులు: జలుబు, దగ్గు, గొంతు నొప్పికి సంబంధించిన మందులను కూడా ప్యాక్‌ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పు వల్ల చాలా మందికి వచ్చే సాధారణ సమస్యలు ఇవే!

⇒ ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ : బ్యాండేజీలు, యాంటిసెప్టిక్‌ క్రీమ్, యాంటిసెప్టిక్‌ వైప్స్, పెయిన్‌ రిలీఫ్‌ స్ఫ్రేస్‌ వంటి వాటిని తీసుకెళ్లే చిన్న చిన్న దెబ్బలు, స్క్రాచెస్‌ వచ్చినా మీరు వెంటనే ట్రీట్మెంట్‌ ప్రారంభించవచ్చు.
⇒ చాలా మందికి వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగా కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటికి తగ్గట్టు ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది:
⇒ ఇన్  హేలర్స్‌ : ఆస్తమా ఉన్నవాళ్లు ఆస్తమా ఇన్  హేలర్స్‌ తీసుకెళ్లవచ్చు. 

⇒ ఎడిపెన్‌ : తీవ్రమైన అలర్జీలు ఉన్న వాళ్లు ఎడిపెన్‌ తీసుకెళ్తుంటారు.
⇒ మధుమేహం : డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఇన్సులిన్, గ్లూకోజ్‌ మీటర్, టెస్ట్‌ స్ట్రిప్స్‌ , ఎమర్జెన్సీ గ్లూకాగోన్‌ తీసుకెళ్లవచ్చు.

⇒ కాంటాక్ట్‌ లెన్స్  సొల్యూషన్‌ : ఒకవేళ మీరు కాంటాక్ట్‌ లెన్స్  ధరించేవారు  అయితే తప్పకుండా ఇది తీసుకెళ్లవచ్చు. ప్రోఫెషనల్‌గా ప్యాకింగ్‌ చేసుకోవడానికి టిప్స్‌ 
⇒ పైన వివరించిన అవసరాలను బట్టి వైద్యుల సూచనల మేరకు కావాల్సిన మెడిసిన్‌ తీసుకున్నాక వాటిని ఎలా ప్యాక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.
⇒ ఒరిజినల్‌ కంటైనర్స్‌: మందులను వాటి కంటైనర్స్‌తో సహా ప్యాక్‌ చేసుకోండి. సింపుల్‌గా చె΄్పాలి అంటే మెడికల్‌ షాపులో తీసుకున్నప్పుడు ప్యాక్‌ ఎలా ఉంటుందో అలాగే క్యారీ చేయాలి. 

⇒ క్యారీ ఆన్‌ బ్యాగు బెస్టు : మీకు అత్యవసరం అనిపించే మెడిసిన్  ను చెక్డ్‌ లగేజీలు అస్సలు పెట్టకండి.మీతో పాటు క్యారీ చేసే బ్యాగులోనే పెట్టుకోండి.
⇒ ఎక్స్‌ట్రా తీసుకెళ్లండి : మీ ప్రయాణం వ్యవధిని బట్టి మందులను ప్లాన్‌ చేసుకోండి. వీలైతే ఒక వారం మందులను ఎక్స్‌ట్రా పెట్టుకోండి. 

⇒ క్లియర్‌ బ్యాగ్‌ : మెడిసిన్‌ అంతా కూడా పారదర్శకంగా ఉండే క్లియర్‌ బ్యాగులో క్యారీ చేయండి. సెక్యూరిటీ చెకింగ్‌ సమయంలో సులభంగా వాటిని చూపించే అవకాశం ఉంటుంది. 

 పేపర్‌ వర్క్‌: కావాల్సిన డాక్యుమెంట్స్‌ 
⇒ విదేశీ ప్రయాణంలో మనమేంటో, మన అవసరాలు ఏంటో పేపర్‌పై ఉండాలి. అందుకే పేపర్‌ వర్క్‌ను లైట్‌ తీసుకోకండి. 

⇒ ప్రిస్క్రిప్షన్‌ కాపీ : మీ మెడిసిన్  కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్‌ కాపీలను పేపర్‌ రూపంలో, డిజిటల్‌గా (మొబైల్లో లేదా క్లౌడ్‌లో) అందుబాటులో ఉంచుకోండి. 
⇒ డాక్టర్‌ లెటర్‌ : మీ ఆరోగ్య పరిస్థితి గురించి , మీరు తీసుకునే మందుల గురించి మీ వైద్యుడు రాసిన లేఖ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది కూడా. 

⇒ మందుల జాబితా: పైన వివరించి విధంగా మీ మందులకు సంబంధించిన సమాచారాన్ని పేర్లను, వేసుకోవాల్సిన సమయం, డోజేజ్, వైద్యుడి కాంటాక్ట్‌ నెంబర్‌ వంటివి అన్నింటినీ కలిపి ఒక లిస్టు తయారు చేసి దాన్ని మీ కుటుంబ సభ్యుల వద్దో, ఫ్రెండ్‌ వద్దో ఉంచండి.
బయల్దేరే ముందు: మీరు తీసుకెళ్తున్న మందులను ఒక్కొక్కటిగా మీరు వెళ్లనున్న దేశాలు అనుమతిస్తాయో లేదో చెక్‌ చేయండి. డౌట్‌ వస్తే ఎంబసీ లేదా కాన్సులేట్‌కు కాల్‌ చేసి అడగండి.
మీరు బయల్దేరే ముందు ఒకసారి డాక్టర్‌తో మాట్లాడండి.

గమనిక: ఏ మందులు తీసుకెళ్లాలో అనేది మీ వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు నిర్ణయం తీసుకోండి. అలాగే ఏ దేశం వెళ్తున్నారో ఆ దేశంలో మీరు తీసుకెళ్లే మందులు చట్టబద్ధమో కాదో కూడా చెక్‌ చేసుకోండి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)