Breaking News

ఒరిజినల్‌ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?

Published on Wed, 12/11/2024 - 10:03

మేము 15 సంవత్సరాల క్రితం ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు కొన్నాము. ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నాము. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మా ఒరిజినల్‌ దస్తావేజులు పోయాయి. మేము రెవెన్యూ ఆఫీసు నుంచి సర్టిఫైడ్‌ కాపీలను తీసుకున్నాము. ఆ కాపీల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి అని కొనుక్కునే వారికి చెప్పగా వారు వెనుకడుగు వేస్తున్నారు. కొందరేమో ‘కాగితాల పని మేము చూసుకుంటాము కానీ పాతిక లక్షలు తక్కువ ఇస్తాం..’ అంటున్నారు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి పరిష్కారం చూపగలరు. 
– విజయ్‌ వర్ధన్, వరంగల్‌

ఇంటి రిజిస్ట్రేషన్‌ / పూర్వ ఒరిజినల్‌ పత్రాలు లేనప్పుడు కొనేవారు కొంత సంకోచించడం సమంజసమే. ఒరిజినల్‌ దస్తావేజులని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి తర్వాత అదే ఆస్తిని మరొకరికి అమ్మడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్‌ తాకట్టు ఈ.సీ లో కూడా కనపడదు కాబట్టి కొనుక్కునేవారు అమాయకంగా మోసపోతూ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం అయిపోయింది. 

టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌ చేస్తే తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాలి అనే నిబంధన లేకపోవడం ఇందుకు కారణం. ఒరిజినల్‌ దస్తావేజులు లేని కారణం చూపించి మార్కెట్‌ విలువ కన్నా తక్కువ ధరకు మాత్రమే కొంటాము అని చాలామంది అంటారు. ఒరిజినల్‌ పత్రాలు లేనంత మాత్రాన ఆ స్థలం కానీ, ఇల్లు కానీ మీది కాకుండా పోదు, మీకు మీ ఆస్తిని అమ్మే హక్కు లేకుండా పోదు!  మీరు తక్షణమే మీ ఇంటి పత్రాలు పోయాయి అని పోలీసులకి ఫిర్యాదు ఇవ్వండి. అ

దేవిధంగా మీరు ఒక లాయర్‌ ద్వారా పేపర్‌ ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రకటన కాపీలను మరలా పోలీసు వారికి అందించాలి.  పోలీసు వారు ‘ఫలానా వారి దస్తావేజులు పోయాయి, తిరిగి వెతికినా దొరకడం లేదు’ అని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్‌ (నాన్‌ ట్రేసబుల్‌ సర్టిఫికెట్‌) జారీ చేస్తారు. 

ఆ సర్టిఫికెట్‌ను తీసుకొని మీరు రెవెన్యూ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే మీకు డూప్లికేట్‌ కాపీలు ఇస్తారు. అలా పొందిన పత్రాలు ఒరిజినల్‌ దస్తావేజులతో సమానం. మీరు వివరించిన పరిస్థితులలో అమ్మే వారికి –కొనేవారికి కూడా ఇది సురక్షితమైన పరిష్కారం.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

(చదవండి: ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)