Breaking News

రతన్‌ టాటాకు స్ఫూర్తి ఎవరో తెలుసా..!

Published on Fri, 10/11/2024 - 09:49

రతన్‌ టాటా మన దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త. పారిశ్రామిక విజయాలలోనే కాదు, వదాన్యతలోనూ ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాత. అంతటి రతన్‌ టాటాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే నానుడి రతన్‌ టాటా విషయంలోనూ నిజమే!  చిన్ననాటి నుంచి రతన్‌ టాటాకు స్ఫూర్తి ఆయన నాయనమ్మే! రతన్‌ టాటా నాయనమ్మ నవాజ్‌బాయి టాటా సన్స్‌ కంపెనీకి మొదటి మహిళా డైరెక్టర్‌. టాటా ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె సేవలందించారు.

రతన్‌ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడాకులు పొంది విడిపోయారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో రతన్‌ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ టాటాల బాధ్యతను నాయనమ్మ నవాజ్‌బాయి  చేపట్టారు. వారిద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. సాటి మనుషులతో మెలగాల్సిన తీరును, జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించారు. 

తన జీవితాన్ని తీర్చిదిద్దిన నాయనమ్మే తనకు స్ఫూర్తి ప్రదాత అని, తాను సాధించిన విజయాల ఘనత ఆమెకే చెందుతుందని రతన్‌ టాటా ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నాయనమ్మ పెంపకంలో పెరగకపోయి ఉంటే, తాను ఇంతటివాణ్ణి కాగలిగేవాణ్ణి కాదని రతన్‌ టాటా తరచుగా చెబుతుండేవారు. 

ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్య కోసం రతన్‌ టాటా అమెరికా వెళ్లారు. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్‌ ఏంజెలిస్‌లోని ఒక ఆర్కిటెక్చర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడే స్థిరపడిపోవాలనుకున్న దశలో నాయనమ్మ నవాజ్‌బాయి అనారోగ్యానికి లోనయ్యారు. స్వదేశానికి తిరిగి వచ్చేయమని ఆమె కోరడంతో రతన్‌ టాటా అమెరికా జీవితానికి స్వస్తిచెప్పి, బాంబేకు వచ్చేసి, టాటా సంస్థల బాధ్యతల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు.  

(చదవండి: నాలుగుసార్లు ప్రేమలో పడినా..!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)