Breaking News

చదివే చోటు సరిగ్గా ఉందా?

Published on Sat, 01/04/2025 - 09:56

వంట గది చప్పుళ్లు... టీవీ సౌండు... తల్లిదండ్రుల కబుర్లు, వాదనలు,... చిన్న తమ్ముడో, చెల్లెలో మధ్యలో దూరి ఆటలు... ‘మంచి మార్కులు తేవాలి’ అంటారు గాని చదివేందుకు మంచి చోటును చూపిస్తున్నారా? సంక్రాంతి దాటితే పిల్లలందరూ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వాలి.ఇంట్లో మీ పిల్లలు చదివే చోటును చూడండి.వారు శ్రద్ధగా చదువుకునేలా ఆ చోటును ఎలా ఏర్పాటు చేయాలో  నిపుణుల మాట వినండి.

ఇల్లు సర్దుకుంటే ఇల్లు ఎంత విశాలమో అర్థమవుతుంది. చిన్న ఇల్లయినా పెద్ద ఇల్లయినా సర్దుకోవడంలోనే స్థలం బయట పడుతుంది. ముంబై వాసులు అతి చిన్న ఇంటిలో కూడా అన్నీ అందంగా అమర్చుకుంటారు. కాని మనకు ఎంత విశాలమైన ఇల్లు ఉన్నా అవసరం లేని సామాను, వాడని సామాను, పారేయని సామాను ఉంచుకుని పిల్లల చదువుకు, పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా తయారు చేస్తాం. మళ్లీ వాళ్లు బాగా చదవాలని డిమాండ్‌ చేస్తాం. శుభ్రమైన చోటు చదువు తలకెక్కే చోటు అలాంటి చోటును మీ ఇంట్లో మీ పిల్లలకు చదువు కోసం కేటాయిస్తున్నారా?

అబ్రహం లింకన్‌ వీధి దీపాల కింద చదివాడు. ఎనభైల నాటి పిల్లలు డాబాల మీద లైట్లు లాగి చదివారు. కాని ఇప్పటి పిల్లలు అలా చదవడం లేదు. ఇంటిలోనే నిశ్శబ్దంగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్లకు యోగ్యమైన చోటును ఏర్పాటు చేయాలి. కామన్‌ ఏరియాకు సంబంధం లేకుండా ఎవరైనా ఇంటికి వచ్చి వెళుతున్నా కన్ను పడని చోటు ఇంటిలో చదువుకునే పిల్లలకు ఇవ్వాలి. ఆ చోటును పూర్తిగా శుభ్రంగా ఉంచాలి. పిల్లలు కంప్యూటర్‌లో ప్రశ్నాపత్రాలు చూసి చదువుకుంటున్నారు. వారికి డెస్క్‌టాప్‌ లేదా లాప్‌టాప్‌ ఏర్పాటు చేయలేకపోతే కనీసం ఫోన్‌లో అన్నా తగినంత డేటా వేయించి ఇవ్వాలి.

పిల్లలు చదివి అలసి పడుకోవాలంటే ఆ దాపునే బెడ్‌ ఉంటే మరీ మేలు. అది వాలగానే నిద్రపోయేలా తప్పక శుభ్రంగా సౌకర్యంగా ఉండాలి. కష్టపడి చదివి నిద్ర పట్టక ఇబ్బంది పడితే చదివింది నిద్ర లేమి వల్ల వృధా అవుతుంది.

పిల్లలు చదువుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇంట్లో తగాదాలు పూర్తిగా బంద్‌ చేయాలి. తల్లిదండ్రులు మంచి మూడ్‌లో కనిపిస్తూ పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. వారికి ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంచాలి. బయట తిండి కాకుండా ఇంటి తిండి ఇవ్వాలి.

∙పిల్లలు చదువుకునే సమయంలో దగ్గర కూచుని అప్పుడప్పుడు పలకరిస్తూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటే వాళ్లూ ఆ ప్రెజెన్స్‌ ఇష్టపడతారు. అయితే రోజూ నువ్వు 99 పర్సెంట్‌ తేవాలి... టాపర్‌గా నిలవాలి అనే మాటలు ఎత్తి స్ట్రెస్‌ క్రియేట్‌ చేయకూడదు. న్యాయంగా ఎంత కష్టపడాలో అంత కష్టపడమని మాత్రమే చెప్పాలి.

∙గంటకోసారన్నా చదివే చోట నుంచి లేచి కాస్త అటూ ఇటూ నడిచేలాగా, నీరు తాగేలా, బాల్కనీలోనో కారిడార్‌లోనో కాస్త గాలి పీల్చేలా చూడాలి.
∙ 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)