Breaking News

నేచురల్‌గా ఇంట్లోనే లిప్‌ బామ్‌ తయారు చేసుకోండిలా!

Published on Tue, 08/27/2024 - 11:57

సీజన్‌ ఏదైనా పెదవుల రక్షణకు లిప్‌ బామ్‌ వాడటం తప్పనిసరి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా  వాటి సంరక్షణ అవసరం. పెదవుల్ని హైడ్రేటెడ్‌గా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు లిప్‌ బామ్‌ తోడ్పడుతుంది. పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యల నివారణతోపాటు, యూవీ కిరణాల నుంచిరక్షణ కల్పిస్తాయి. కానీ మార్కెట్లో దొరికే ఖరీదైన, రసాయన బామ్‌లకు బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని సరైన  పోషణ లభించేలా చేయవచ్చు.

లిప్‌ బామ్‌ తయారీ
రెండు టీ స్పూన్ల మైనం, టీ స్పూన్‌ కోక్‌ పౌడర్, రెండు టీ స్పూన్లు బాదం నూనె, 5–6 చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ తీసుకోవాలి. ముందుగా మైనాన్ని కరిగించాలి. దీంట్లో కోక్‌  పౌడర్‌ వేసి బాగా కలపాలి. కోక్‌ పౌడర్‌ బాగా కలిసిపోయాక బాదం నూనె, ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి కలపాలి. దీన్ని ఒక చిన్న బాటిల్‌లో భద్రపరుచుకొని రోజుకు రెండు మూడుసార్లు పెదవులకు రాసుకోవాలి. ఈ బామ్‌ పెదవుల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇంట్లో లిప్ బామ్‌ను  తయారు చేసుకోవడం వల్ల  హానికరమైన రసాయన పదార్థాలను నియంత్రించవచ్చు.  అలాగే  కృత్రిమ  సువాసనలను లేదా ఇతర హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండవచ్చు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)