Breaking News

సొరకాయ చపాతీలు: ఇలా చేస్తే...ఆ టేస్ట్‌ వేరు!

Published on Fri, 02/23/2024 - 10:56

పాలక్‌ చపాతీ, ఆలూ చపాతీ, మేతీ చపాతీ ఇలా చాలా  రకాలుగా రుచికరమై చపాతీలను చేసుకోవచ్చు.  కానీ చపాతీలు చేయాలంటే.. మెత్తగా వస్తాయో రావోనని చాలామందికి భయం. పిండి సరిగ్గా కలపకపోయినా, ఇంగ్రీడియంట్స్‌ సమ పాళ్లలో పడకపోయినా, చపాతీలు మన మాట వినవు.   మరి సొరకాయ (లౌకీ, బాటిల్‌ గార్డ్‌, ఆనపకాయ)  చపాతీ ఎపుడైనా ట్రై చేశారా?  మెత్తగా దూదుల్లాంటి సొరకాయ చపాతీ ఎలా చేయాలో  చూద్దాం. 

కావలసినవి: సొరకాయ తురుము – రెండు కప్పులు; పచ్చిమిర్చి తరుగు–టీ స్పూన్‌,  గోధుమపిండి – రెండున్నర కప్పులు, గరం మసాలా – అర టీ స్పూన్‌ ; ఉప్పు – చిటికెడు; ఇంగువ– చిటికెడు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ: ∙వెడల్పుగా ఉన్న పాత్రలో గోధుమపిండి, సొరకాయ తురుము, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. మొదట తేమ సరిపోదనిపించినప్పటికీ సొరకాయలో నీరు వదిలేకొద్దీ సరిపోతుంది. పది నిమిషాల సేపు పక్కన ఉంచితే నీరు బయటకు వస్తుంది. నీరు వదిలిన తర్వాత పిండిని కలిపి చూసుకుని అప్పటికీ  పొడిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించుకుని మిశ్రమం మొత్తాన్ని చపాతీ పిండిలా చేసుకుని వస్త్రాన్ని కప్పి పావు గంట సేపు పక్కన ఉంచాలి. పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకుని చ΄ాతీల్లా వత్తుకుని పెనం వేడి చేసి నూనె వేస్తూ చపాతీని రెండు వైపులా కాల్చాలి.

గమనిక: చపాతీ వత్తేటప్పుడు పిండి జారుడుగా ఉన్నట్లనిపిస్తే పొడి పిండి చల్లుకుని బాగా కలిసే వరకు మర్దనా చేసి అప్పుడు చపాతీ చేసుకోవాలి. సొరకాయ చపాతీ సాధారణ గోధుమ పిండి చపాతీలా సమంగా ఒకే మందంలో రావడం కష్టం. మరీ పలుచగా కూడా వత్తకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. వేడిగా తింటే మృదువుగా, రుచిగా ఉంటాయి. వేసవిలో చపాతీలు తింటే వేడి చేస్తుందని భయపడేవాళ్లు సొరకాయ చపాతీ ప్రయత్నించవచ్చు. ఈ చపాతీలను మనకు నచ్చిన కూర, చట్నీతోగానీ, లేదంటే  వేసవి కాలం చల్లని పెరుగుతో  తిన్న బావుంటుంది. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)