రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
రోటీస్‌లో మంచి సైడ్ డిష్ బైగాన్ బార్తా ఇలా చేసుకోండి..
Published on Tue, 07/18/2023 - 16:47
బైగన్ కా బార్తా తయారీకి కావల్సినవి:
మీడియం సైజు వంకాయలు – రెండు ; వెల్లుల్లి రెబ్బలు – నాలుగు ;
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ; వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ;
అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) ; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ;
ఉల్లిపాయ తరుగు – అరకప్పు ; కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ;
ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు.

తయారీ విధానమిలా..
- వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి.
- ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి.
- ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి.
- వంకాయ కాలిన తరువాత చల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి.
- బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
- కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి.
- నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్ డిష్.

#
Tags : 1