Breaking News

స్వీట్‌ పొటాటోతో బిస్కెట్స్‌.. మీరెప్పుడైనా ట్రై చేశారా?

Published on Fri, 11/24/2023 - 16:54

స్వీట్‌ పొటాటో బిస్కెట్స్‌ తయారీకి కావల్సినవి:

చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు;
మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్‌ స్టార్చ్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు;
పంచదార – రెండున్నర టేబుల్‌ స్పూన్లు; వంటసోడా – టేబుల్‌ స్పూను;
ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్‌ – అరకప్పు.

తయారీ విధానమిలా:
►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో కార్న్‌ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్‌ చేయాలి.
► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి.
► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్‌ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్‌ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్‌ చేయాలి. ముక్కలు గోల్డెన్‌ కలర్‌లోకి మారితే స్వీట్‌ పొటాటో బిస్కెట్స్‌ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)