Breaking News

ఇది పకోడీ కాలం..

Published on Fri, 07/26/2024 - 09:31

ఇది వర్షాకాలం. వాన చినుకులు పడుతుంటే... వేడి వేడి పకోడీలు తింటూ గరం గరం చాయ్‌ తాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏడాదంతా వర్షాకాలమే ఉంటే బావుణ్ననిపిస్తుంది. ఇది వర్షాకాలం కాదు పకోడీల కాలం అనాలనిపిస్తుంది.

పోహా పకోడీ..
కావలసినవి:
అటుకులు– ఒకటిన్నర కప్పులు;
బంగాళాదుంప– అర కప్పు(ఉడికించి చిదిమినది);
కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు;
పచ్చిమిర్చి తరుగు– టీ స్పూన్‌;
మిరప్పొడి– టీ స్పూన్‌;
చక్కెర – అర టీ స్పూన్‌;
నిమ్మరసం – అర టీ స్పూన్‌;
జీలకర్ర– అర టీ స్పూన్‌;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
నూనె– వేయించడానికి తగినంత.
తయారీ:
– అటుకులను ఒక పాత్రలో వేసి (అటుకులు తేలేటట్లు) నిండుగా నీటిని పోసి కడిగి వడపోత గిన్నెలో వేయాలి.
– నీరంతా కారిపోయిన తర్వాత తీసి వెడల్పు పాత్రలో వేసుకోవాలి.
– అందులో ఉడికించి చిదిమిన బంగాళాదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరప్పొడి, చక్కెర, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.
– ఈ మిశ్రమం అంతటినీ చిన్న నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి.
– బాణలిలో నూనె వేడి చేసి, మరుగుతున్న నూనెలోఒక్కో గోళీని మెల్లగా వేయాలి.
– మంటను మీడియంలో పెట్టి దోరగా వేగనివ్వాలి.
– అన్నివైపులా ఎర్రగా వేగిన తర్వాత చిల్లుల గరిటతో తీసి టిష్యూ పేపర్‌ మీద వేస్తే పోహా పకోడీ రెడీ. వీటికి పుదీన చట్నీ లేదా టొమాటో కెచప్‌ మంచి కాంబినేషన్‌.

కార్న్‌ పకోడీ..
కావలసినవి:
స్వీట్‌ కార్న్‌ గింజలు– 2 కప్పులు;
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్‌లు;
జీలకర్ర– అర టీ స్పూన్‌;
శనగపిండి– 3 టేబుల్‌ స్పూన్‌లు;
బియ్యప్పిండి– 3 టేబుల్‌ స్పూన్‌లు;
గరం మసాలా – అర టీ స్పూన్‌;
ఉల్లిపాయ – ఒకటి (తరగాలి);
పచ్చిమిర్చి – 2 (తరగాలి);
కరివేపాకు – 2 రెమ్మలు;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
పసుపు – పావు టీ స్పూన్‌;
మిరప్పొడి– అర టీ స్పూన్‌;
నూనె – వేయించడానికి తగినంత.

తయారీ:
– మొక్కజొన్న గింజలను కడిగి చిల్లుల పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి.
– ఈ లోపు ఒక పాత్రలో నూనె మినహా పైన తీసుకున్నవన్నీ వేసి కలపాలి.
– మొక్కజొన్న గింజల్లో గుప్పెడు గింజలను తీసి పక్కన పెట్టి మిగిలిన గింజలను మిక్సీలో కచ్చపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
– ఇప్పుడు పక్కన పెట్టిన గింజలను కూడా శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి.
– బాణలిలో నూనె మరిగించి పకోడీ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వేళ్లతో కొద్దికొద్దిగా నూనెలో వేయాలి.
– దోరగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్‌ మీద వేస్తే వేడి వేడి కార్న్‌ పకోడీలు తినడానికి రెడీ. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)