Breaking News

ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ : అదిరిపోయే కిచెన్‌ టిప్స్‌!

Published on Sat, 11/16/2024 - 11:27

ఎంతో కష్టపడి, ఎంతో రుచిగా ఇంట్లోనే  వండిపెట్టినా,  రెస్టారెంట్‌లో   చేసినట్టుగా రాలేదు, క్రంచీగా లేవు, క్రిస్పీగా రాలేదు అంటూ రక రకాలవంకలు పెడుతూ ఉంటారు పిల్లలు. దీనికి అవును...అంటూ వారికి వంత పాడతారు శ్రీవారు.. కదా.. అందుకే అదిరిపోయే కిచెన్‌ టిప్స్‌ మీకోసం..!

పొటాటోతో ఇంట్లో ఫ్రెంచ్‌ ఫ్రై చేసినప్పుడు రెస్టారెంట్‌లో ఉన్నట్లు కరకరలాడవు. రెస్టారెంట్‌ రుచి రావాలంటే పొటాటో స్టిక్స్‌ని నూనెలో ఒక మోస్తరుగా వేయించి తీయాలి. వేడి తగ్గిన తరవాత వాటిని  పాలిథిన్‌ కవర్‌లో పెట్టి రబ్బర్‌ బ్యాండ్‌తో బిగుతుగా కట్టి ఫ్రీజర్‌లో పెట్టాలి. నాలుగైదు గంటల తర్వాత తీసి మరోసారి వేయించి వేడిగా ఉండగానే వడ్డించాలి.  

కొత్త బియ్యాన్ని వండినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. అన్నం ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే ముద్ద కాకుండా అన్నం మెతుకులు విడివిడిగా ఉంటాయి.  తినడానికి బావుంటుంది.

ఈ సీజన్‌లో లభించే చిలగడ దుంపలను ఉడికించి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి, కాస్తంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి చల్లి ఇస్తే ఇష్టంగా తింటారు పిల్లలు.

పప్పుతో పాటు, ఇంట్లోనే చేసిన సగ్గుబియ్యం వడియాలు,  మినప వడియాలు నంజుకు పెడితే మారాం చేయకుండా పప్పు నెయ్యి అన్నంతో  పాటు   తినేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యంకూడా 

పరాఠాలకు పిండి కలిపేటప్పుడు అందులో స్వీట్‌ కార్న్‌ (చిదిమి కలపాలి), ఉడికించిన పాలకూర, తురిమిన క్యాబేజ్, తురిమిన ముల్లంగి, మెంతి ఆకు కలిపితే పిల్లలు ఇష్టపడతారు. ఇది హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌. 

చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కలిపిన తర్వాత తడి బట్టను కప్పి అరగంట సేపు నాననిస్తే మంచిది.

కూరల్లో ఉప్పు ఎక్కువైతే వెంటనే బంగాళాదుంపను తొక్క తీసి, చిన్న ముక్కలు చేసి కూరలో కలపాలి. అదనంగా ఉన్న ఉప్పు బంగాళదుంప పీల్చుకుంటుంది.  

ఇదీ చదవండి: దోస ప్రింటింగ్‌ మెషీన్‌ : వైరల్‌ వీడియో


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)