Breaking News

ఇంట్లోనే ఈజీగా నేచురల్‌ హెయిర్‌ డై చేసుకోండిలా..!

Published on Wed, 02/21/2024 - 11:01

ప్రస్తుత రోజుల్లో తెల్లజుట్టు అనేది కామన్‌ అయ్యిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అంతేగాదు ఎవరూ పెద్దవాళ్లో, చిన్నవాళ్లో చెప్పడం కూడా కష్టంగా ఉంది. అలా అయిపోయింది మన జీవనశైలి. దీనికి తోడు బయట ఉండే కాలుష్యం కారణంగా మెరిసిపోవడం తోపాటు ఊడిపోతుంది. అందుకోసం బయట మార్కెట్లో కనిపించే హెయిర్‌ డైల పై ఆధారపడుతుంటాం. అవేమో నానా రకాల సైడ్‌ ఎఫ్‌క్ట్‌ ఇచ్చి మరో సమస్య ఎదురవ్వుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టి ఇంట్లోనే చక్కగా సహజ పద్ధతిలో డై చేసుకుంటే అంతకుమించి హాయి ఇంకొకటి ఉండదు. అయితే ఇదెలా చేయాలి. అందుకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి అని కంగారు పడొద్దు. అవన్నీ మనఇంట్లో దొరికేవే. మన నిత్యం చూసే వాటితోనే సులభంగా చేయ్యొచ్చు. అవేంటో చూద్ధాం. !

ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గానే ఇంట్లోనే డైని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఉల్లి తొక్క. ఉల్లి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని రానియ్యకుండా చేస్తుంది. ఇందులోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకి మంచిది. ఉల్లితొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.

ఇక అలోవెరా జెల్‌లోనూ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి, జుట్టు, చర్మానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని దూరం చేసి జుట్టు మెరిసేలా, సాఫ్ట్‌గా చేస్తుంది. అంతే కాదు, జుట్టు మూలాలకు సహజ తేమని అందించడంలో అలోవెరా జెల్ ముందుంటుంది.

ఎలా చేయాలంటే..
ఈ నేచురల్‌ డైకి ముఖ్యంగా కావాల్సింది ఉల్లితొక్క. ఫంగస్ లేని ఉల్లి తొక్కుని తీసుకుని ఓ పాన్‌వేసి బాగా వేయించండి. మొత్తం నల్లగా మారాలి. దీనిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇందులోని కలబంద జెల్ వేసి బాగా కలపండి. దీనిని జుట్టుకి రాయండి.

ఇది మొత్తం నేచురల్ పద్ధతిలో తయారైన హెయిర్ డై. దీనిని వారానికి ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తలకి మొత్తంగా రాసి గంట తర్వాత క్లీన్ చేయాలి. ఇది జుట్టుని నల్లగా చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పైగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరీ..!

(చదవండి: పైనాపిల్‌ మంచిదని తినేస్తున్నారా? అతిగా తింటే సమస్యలు తప్పవు!)

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?