Breaking News

కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు

Published on Fri, 11/24/2023 - 15:36

కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. 

తినాయ్‌(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి:

కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. 

తయారీ విధానమిలా:
►కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు దోరగా వేయించాలి.
► కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి.
►బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్‌లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్‌ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)