Breaking News

చెర్రీ చాక్లెట్‌ బాల్స్‌.. ఒక్కసారి రుచి చూస్తే వదలిపెట్టరు

Published on Mon, 07/31/2023 - 16:48

చెర్రీ – చాక్లెట్‌ బాల్స్‌ తయారీకి కావల్సినవి:
చెర్రీలు – 3 కప్పులు (గింజలు తీసి, శుభ్రం చేసి, గుజ్జులా చేసుకోవాలి), చాక్లెట్‌ చిప్స్‌ – అర కప్పు (ఓవెన్‌లో క్రీమ్‌లా మెల్ట్‌ చేసుకోవాలి)
వాల్‌ నట్స్‌ – 1 కప్పు (మెత్తగా పౌడర్‌ చేసుకోవాలి)
జీడిపప్పులు – పావు కప్పు (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి)
ఖర్జూరం గుజ్జు – పావు కప్పు (గింజలు తీసి, ముక్కలు చేసి పెట్టుకోవాలి)
ఉప్పు – చిటికెడు, దాల్చినచెక్క పొడి – కొద్దిగా, కొబ్బరి పాలు – 100 గ్రాములు
కొబ్బరి తురుము – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి), నెయ్యి – కొద్దిగా

తయారీ విధానమిలా:
ముందుగా మిక్సీ బౌల్‌లో ఖర్జూరం ముక్కలు, 50 గ్రాముల కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో చెర్రీ గుజ్జు, దాల్చినచెక్క పొడి, మిగిలిన కొబ్బరి పాలూ పొసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలో చాక్లెట్‌ క్రీమ్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కచ్చాబిచ్చాగా చేసుకున్న జీడిపప్పు ముక్కలు, వాల్‌నట్‌ పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నేతిని చేతులకు రాసుకుని.. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. కొబ్బరి తురుముతో లేదా కోకోనట్‌ బటర్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటాయి. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)