Breaking News

గోళ్లు పొడవుగా అందంగా ఉండాలంటే..ఇలా చేయండి!

Published on Thu, 08/24/2023 - 09:41

గోళ్లు ..పొడవుగా అందంగా ఉండే ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ కొందరిలో కొద్దిగా పెరగగానే విరిగిపోతుంటాయి. కొంతమందికి అసలు పెరగవు. దీంతో నెయిల్‌ పెయింట్‌ వేసుకోవాలంటే ఇబ్బంది. గోళ్లను చక్కగా పెంచే ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి మీ కోరిక తీరుతుంది.. గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆలివ్‌ ఆయిల్‌ ముందుంటుంది. దీనిలోని విటమిన్‌ ఇ గోళ్లకు పోషణ అందించి చక్కగా పెరిగేలా చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను గోళ్లమీద రాసి మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల గోళ్లకు రక్తప్రసరణ చక్కగా జరిగి గోళ్లలో పెరుగుదల కనిపిస్తుంది.

టీస్పూను యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో టీస్పూను వెల్లుల్లి తరుగు వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లపై రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే గోళ్లు విరగకుండా చక్కగా పెరుగుతాయి. వెల్లుల్లి రెబ్బను రెండు ముక్కలు చేసి గోళ్లపై పదినిమిషాలపాటు రుద్దాలి. కొద్దిరోజుల్లోనే గోళ్ల పెరుగుదల కనిపిస్తుంది. ఆరెంజ్‌ జ్యూస్‌ను గోళ్లకు పూతలా అప్లైచేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది గోళ్లను అందంగా పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ చేయలేకపోతే కొబ్బరినూనెను గోళ్లపై రాసి రోజూ మర్దన చేయాలి. కొబ్బరినూనెలోని ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు గోళ్ల పెరుగుదలకు దోహదపడతాయి.  

(చదవండి: కీర్తి సురేశ్‌ అందంగా ఉండేందుకు.. అవి వాడుతుందట!)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)