Breaking News

గుబురుగా, తాజాగా కొత్తిమీర : బాల్కనీలోనే ఇలా పెంచుకోండి!

Published on Wed, 07/10/2024 - 11:36

ప్రస్తుతం కాలంలో ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పూలను సాగు చేయడం ఒక అలవాటుగా మారింది.  చాలామంది టెర్రస్‌ గార్డెన్‌, బాల్కనీ గార్డెనింగ్‌  పేరుతో ఉన్నకొద్దిపాటి స్థలంలోనే చాలా రకాల మొక్కల్ని పెంచుతూ సేంద్రీయ ఉ‍త్పత్తులను సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.  ఇది కాలుష్యం లేని ఆహారాన్ని అందించండం మాత్రమే  కాదు  ఇంటి వాతావారణానికి, పర్యావరణానికి చాలా మంచిది కూడా.  ఇంట్లో చిన్న చిన్న కుండీలల్లో కొత్తమీర, పుదీనా లాంటి వాటిని సులభంగా పండించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇంత అంత ఈజీ కూడా కాదు. మరి సులభంగా, చక్కగా కొత్తిమీరను ఎలా పండించుకోవాలో చూద్దామా!

ఇంట్లో కొత్తిమీరను పెంచడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. కొత్తిమీరలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెంచేందుకు విత్తన ఎంపిక చాలా ముఖ్యం. ఇందులో శాంటో, లీజర్ లేదా కాలిప్సో వంటి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ రకాలు త్వరగా మొలకెత్తి, ఎక్కువ కాలం పంట ఉండేలా చేస్తుంది.

సరైన కంటైనర్‌
కనీసం 8-12 అంగుళాల లోతు, మంచి డ్రైనేజీ ఉన్న కంటైనర్‌, లేదా గ్రో బ్యాగ్‌ను తీసుకోండి. ఎందుకంటే కొత్తిమీర  వేళ్లు లోతుగా వెళతాయి. కుండీ,  లేదా కంటైన్‌ లోతుగా ఉండేలా చేసుకోవాలి. కంటైనర్ దిగువన నీళ్లు పోయేలా రంధ్రాలేన్నాయో లేదో చూసుకోవాలి.

సాయిల్‌ మిక్సింగ్‌ 
కొత్తిమీర బాగా పెరగాలంటే,  బాగా ఎండిపోయే, సారవంతమైన  మట్టి కావాలి. అందుకే కాస్త మట్టి, కొద్దిగా ఇసుక ఉండేలా సేంద్రీయ ఎరువు, అధిక-నాణ్యత పాటింగ్ మిశ్రమాన్ని ఉపయోగించాలి.  మడి మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా  జాగ్రత్తపడాలి.

విత్తనాలు విత్తడం 
నాటేముందు విత్తనాలను(ధనియాలు) కొద్దిగా నలపాలి. అంటే ఒక గుడ్డపై ధనియాలను పోసి చపాతీ కర్రతోగానీ, ఏదైనా రాయితో గానీ సున్నితంగా  నలపాలి. అపుడు గింజలు రెండుగా చీలతాయి. ఇలా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకలొస్తాయి.  1-2 అంగుళాలు దూరంలో విత్తనాలను 1/4 అంగుళాల లోతులో చల్లాలి. ఆపై మట్టితో తేలికగా కప్పి, నీరు  పోయాలి.

మొలకలు 
కంటైనర్‌ను వెచ్చని ఎండ తగిలేలా ఉంచాలి. కొత్తిమీర గింజలు సాధారణంగా మొల కెత్తడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ కాలంలో మట్టిలో నీళ్లు నిల్వలేకుండా, తేమగా ఉండేలా  చూసుకోవాలి.  రోజుకు  కనీసం 4-6 గంటల పాటు ప్రత్యక్ష ఎండ తగలాలి. నీళ్లు పోయడానికి విత్తనాలు చెదిరిపోకుండా, దెబ్బ తగలకుండా, స్ప్రే బాటిల్‌ని ఉపయోగించాలి.

నిర్దిష్ట సమయంలో సాధారణంగా మొలకలు వచ్చేస్తాయి. మట్టిని సమానంగా తేమగా ఉంచడానికి కొత్తిమీర మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి.  ఇంకా బలంగా పెరగాలంటే, నీటిలో కరిగే ఎరువులు, కంపోస్ట్ టీ లేదా డైల్యూటెడ్ ఫిష్ ఎమల్షన్ వంటి సేంద్రీయ  ఎరువు వాడితే మంచిది.  

చక్కగా గుబురుగా, పచ్చపచ్చగా కొత్తిమీర మొక్కలు ఎదుగుతాయి. 6 అంగుళాల ఎత్తు పెరిగాక కొత్తమీరను హార్వెస్ట్‌ చేయ వచ్చు. కోస్తూ ఉంటే, కొత్తమీర ఇంకా గుబురుగా పెరుగుతుంది.  

అఫిడ్స్, సాలీడు , శిలీంధ్ర వ్యాధుల సమస్యలొస్తాయి. ఎలాంటి చీడపీడలు రాకుండా, వేపనూనె, పుల్లటి మజ్జిగ ద్రావణం లాంటి స్ప్రే చేయవచ్చు.  కొత్తమీర పువ్వులు వచ్చేదాకా వాడుకోవచ్చు. దీన్ని బోల్టింగ్‌ అంటారు. ఈ టైంలో ఆకులు చేదుగా మారతాయనేది గుర్తించాలి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)