Breaking News

మృదువైన చేతులు... ముచ్చటేసే ముఖం కోసం...!

Published on Thu, 12/12/2024 - 10:43

చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  శీతగాలుల వల్ల చర్మం  పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్‌ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది.  వీటితో పాటు  సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం,  తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు!

 

బ్యూటీ టిప్స్‌

  • స్పూన్‌ గ్లిజరిన్, స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, స్పూన్‌ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.
  • రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్‌ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్‌ యాసిడ్‌ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.
  • కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని  పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి.  ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే  ముఖ చర్మం మృదువుగా అవుతుంది.
  • కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి. 
  • రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.
  • ఓట్‌మీల్‌  పౌడర్‌ టీ స్పూన్‌ తీసుకుని అందులో ఆరెంజ్‌ జ్యూస్‌ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
  • బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్‌ స్పూన్‌ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది  పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది.  
  • క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది. 

     

     

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)