Breaking News

కంటిపై సోరియాసిస్‌ ప్రభావం!

Published on Tue, 10/22/2024 - 10:46

ఒళ్లంతా పొడిబారిపోయి చర్మంపైనుండే కణాలు పొట్టులా రాలిపోయే చర్మవ్యాధి సోరియాసిస్‌ గురించి తెలియనివారుండరు. తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌) వల్ల  ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. చర్మవ్యాధిగానే చూసే దీని ప్రతికూల ప్రభావాలు కొంతవరకు కంటిపైనా ఉంటాయి. అదెలాగో చూద్దాం.

ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... 
 కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్‌ఫ్లమేషన్‌ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్‌’ అంటారు). 

 కార్నియాకు ఇన్‌ఫ్లమేషన్‌ రావచ్చు (కెరటైటిస్‌).
  కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్‌ (కంజంక్టివైటిస్‌) వచ్చే అవకాశాలున్నాయి. 
  కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు.

జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్‌కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్‌ రేడియేషన్‌ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్‌ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్‌ను వీలైనంతగా  అదుపులో పెట్టడం సాధ్యమవుతోంది. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్‌కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించడం చాలా అవసరం. 
 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)