Breaking News

ఫ్రిజ్ వాసన రాకుండా, కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా చేయండి!

Published on Mon, 07/01/2024 - 16:00

రిఫ్రిజరేటర్‌ లేదా ఫ్రిజ్‌ ఇపుడు అందరి ఇళ్లల్లోనూ ఒక అవసరంగా మారిపోయింది. పాలు, పెరుగు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లతోపాటు వండిన పదార్థాలను పాడుకాకుండా, తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్‌ను వాడతాం.  మరి ఫ్రిజ్‌ శుభ్రత గురించి  ఎపుడైనా ఆలోచించారా? ఫ్రిజ్‌లో బాక్టీరియా పేరుకుపోకుండా, మన ఆహారం శుభ్రంగా ఉండాలంటే ఏం  చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం.

వారాలు, నెలల తరబడి ఫ్రిజ్‌ను శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. ఆహారం త్వరగా పాడవుతుంది. అలాగే  రిఫ్రిజిరేటర్‌ బయటినుంచి కూడా క్లీన్‌గా కనిపించేలా జాగ్రత్తపడాలి.

రిఫ్రిజిరేటర్‌ను ఎలా శుభ్రం చేయాలి?
ముందు రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్‌ చేసి, ప్లగ్‌ తీసి పక్కన బెట్టాలి.  ఇలా చేయడం వల్ల షాక్‌ కొట్టకుండా ఉంటుంది.
కఠినమైన రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వైట్‌ వెనిగర్, డిష్ సోప్‌తో శుభ్రం చేసుకోవచ్చు.

ఫ్రిజ్ షెల్ఫ్‌లు,  ఇతర డిటాచ్‌బుల్‌ డ్రాయర్లను, గ్లాసు ట్రే, ఎగ్‌ ట్రేలను తొలగించి బయట శుభ్రం  చేసుకొని పొడి గుట్టతో తుడిచేయాలి. ఫ్రిజ్‌లో అమర్చేముందు వీటిపై ఆల్కహాల్ రుద్దితే కనిపించని బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోతుంది.

అవసరమైతేనే డీప్‌ ఫ్రిజ్‌ను డి-ఫ్రాస్ట్ చేయాలి.  లేదంటే ఆ ఏరియా వరకు క్లీన్‌ చేసుకోవచ్చు. పాడైపోయిన, డేట్‌ ముగిసిన పదార్థాలను పారేయ్యాలి. 

ఫ్రిజ్‌ డోర్‌కి ఉండే గాస్కెట్‌ సందుల్లో మురికి  పేరుకుపోతుంది.  దీన్ని కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. బయట కూడా డిష్ వాష్ లిక్విడ్‌లో ముంచిన స్పాంజి సాయంతో  మురికి, మరకలు పోయేలా శుభ్రం చేసి, ఆ తరువాత  మెత్తని పొడిగుట్టతోతుడిస్తే తళ తళ కొత్తదానిలా మెరుస్తుంది. ఫ్రిజ్‌లోని వస్తువులు ముట్టుకుంటే పడిపోయేలాగా కాకుండా, చిన్న చిన్న కంటైనర్లలో పళ్లు, కూరలు, తదితరాలను పొందికగా అమర్చుకోవాలి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)