Breaking News

వజ్రం మరో వజ్రాన్ని కోస్తుంది!

Published on Sat, 10/19/2024 - 09:45

ఆభరణం చాలా రోజులు బీరువాలో ఉంచితే కొద్దిగా మసకబారినట్లు అనిపిస్తుంది. ఆభరణం ధగధగలాడాలంటే ధరించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ధరించిన తర్వాత తిరిగి భద్రపరిచేటప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. 

👉ఆభరణాన్ని (బంగారు ఆభరణం, వజ్రాల ఆభరణం ఏదైనా) ధరించే ముందు వెల్వెట్‌ క్లాత్‌ లేదా మెత్తని నూలు వస్త్రంతో సున్నితంగా తుడవాలి. 

👉దుమ్ము పట్టేసినట్లనిపిస్తే వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇది చాలా అరుదుగా మాత్రమే చేయాలి. ఓపెన్‌ సెట్టింగ్‌ వజ్రాల ఆభరణాన్ని వేడి నీటిలో ఒకసారి ముంచి తీసి వెంటనే టిష్యూ పేపర్‌తో తేమ వదిలే వరకు సున్నితంగా తుడవాలి. ఇది ఇతర రంగు రాళ్లేవే లేకుండా అన్నీ వజ్రాలే ఉన్న ఆభరణానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలను వేడి నీటిలో ముంచరాదు. 

👉క్లోజ్‌డ్‌ సెట్టింగ్‌ వజ్రాల ఆభరణాన్ని నీటిలో ముంచకూడదు. నీటిలో ముంచినట్లయితే కొంతనీరు వజ్రానికి బంగారానికి మధ్యలో చేరుతుంది. ఆ నీటిని తొలగించడం కష్టం. మరీ ఎక్కువగా నీరు పట్టినప్పుడు వజ్రాన్ని తీసి మళ్లీ చేయించుకోవడమే మార్గం. కాబట్టి క్లోజ్‌డ్‌ సెట్టింగ్‌ వజ్రాల ఆభరణం మీద పట్టిన దుమ్మును వదిలించాలంటే టిష్యూ పేపర్‌ లేదా వెల్వెట్‌ క్లాత్‌తో తుడవాలి. అంతేకాదు, ఆభరణాలను తరచూ నీటితో శుభ్రం చేస్తుంటే బంగారం కరిగిపోతుంది.  

👉ఏ ఆభరణాన్నయినా (పూర్తి బంగారు ఆభరణాలు, రాళ్లు పొదిగిన ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు) తెల్లటి ప్లాస్టిక్‌ బాక్సుల్లోనే పెట్టాలి. 

👉 వెల్వెట్‌ క్లాత్‌కి రంగును వదిలే స్వభావం ఉంటుంది. దీర్ఘకాలం వెల్వెట్‌ క్లాత్‌ మధ్య ఉంచితే వెల్వెట్‌ క్లాత్‌ రంగు ప్రభావం ఆభరణం మీద పడుతుంది.  

👉వజ్రాల ఆభరణాలు ఒక బాక్సులో ఒక్కటి మాత్రమే ఉండాలి. వజ్రం గట్టిగా ఉంటుంది. కోసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్టోన్‌ కారణంగా మరొక స్టోన్‌ కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)