Breaking News

చిన్న ప్రాణితో.. ప్రాణానికే ముప్పు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published on Mon, 06/16/2025 - 12:06

పోలో మ్యాచ్  ఆడుతూ  తేనెటీగ కుట్టడం, దాన్ని మింగిన తర్వాత  పారిశ్రామికవేత్త , సోనా కామ్‌స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్  గుండెపోటుతో మరణించిన ఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంత చిన్న కారణం అంత ప్రాణాంతకంటా ఎలా మరిందనేది చర్చకు దారితీసింది. అలాంటి సంఘటనలు ఎలా ప్రాణాంతకంగా మారతాయనేది నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.

తేనెటీగ కుట్టడం-అనాఫిలాక్సిస్ 

తేనెటీగ కుట్టడం సాధారణంగా చాలా మందికి హానికరం కాదు, కానీ అలెర్జీ ఉన్నవారికి అవి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయని  వైద్యులు చెబుతున్నారు.  ఇది చాలా  అరుదైనదే, కానీ తీవ్రమైన పరిస్థితులలో, తేనెటీగ కుడితే అనాఫిలాక్సిస్ అనే రియాక్షన్‌ ప్రాణాంతకం కావచ్చు. హిస్టామిన్‌తో సహా రసాయనాలు శరీరంలోకి వేగంగా విడుద లైనప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు విస్తృతంగా వ్యాకోచించడం, రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం, వాపువస్తుంది. ముఖ్యంగా వాయుమార్గాల చుట్టూ ఉన్న ప్రాంతంలో నోరు లేదా గొంతులో కుట్టినా, అనుకోకుండా తేనెటీగను మింగినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుంది.

తేనెటీగ కుట్టినప్పుడు ‘అనాఫిలాక్సిస్’  (Anaphylaxis) అనే  తీవ్రమైన ఎలెర్జీకి కారణమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అనాఫిలాక్సిస్ అనేది ప్రాణాంతకమైన  ఎలర్జీ. కొన్ని సెకన్లలోనే  ముప్పు ఏర్పడవచ్చు.

కొంతమందికి  ఇలా కూడా  కావచ్చు

  • గొంతు లేదా నాలుక మందం, వాపు

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

  •  సడెన్‌గా బీపీ డౌన్‌ 

  • షాక్ లేదా గుండె ఆగిపోవడం

కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా కుట్టడం శ్వాసమార్గం, లేదా వాయునాళాన్ని ప్రభావితం చేసినప్పుడు, అలెర్జీ లేని వ్యక్తులకు కూడా ప్రాణాంతకం కావచ్చు. అనాఫిలాక్సిస్ కౌనిస్ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తుంది. తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య  కరోనరీ ధమనులలో దుస్సంకోచాలను కలిగించేఅరుదైన పరిస్థితి.ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఇదే సంజయ్‌ కపూర్‌ మరణంలో కూడా జరిగి ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం.

ఎలాంటి సందర్బాల్లో ఇలా జరగవచ్చు
చీమలు, తేనెటీగలు, కందిరీగలు, జెల్లీ ఫిష్  కుట్టడం, అలాగే గడ్డి కోస్తున్నపుడు, పాయిజన్ ఐవీ, ర లింపెట్ తీసుకోవడం, మిల్లెట్ అలెర్జీ, షెల్ఫిష్ తిన్నపుడు , విష ప్రయోగం లాంటి సందర్బాల్లో ఇలా జరగవచ్చని వైద్య నివేదికల ద్వారా తెలుస్తోంది.

తేనెటీగ కుట్టినపుడు, అత్యసర పరిస్థితుల్లో ఏమి చేయాలి

తక్షణం వైద్య చికిత్స అవసరం.  ఎపిపెన్ వంటి ఆటో-ఇంజెక్టర్ ద్వారా ఎపినెఫ్రిన్ (అడ్రినలిన్) ఇవ్వాలి. అనాఫిలాక్సిస్‌కు చికిత్స లో ఇది మొదటి స్టెప?  తరువాత అత్యవసర వైద్య సంరక్షణ  అవసరం. రోగి పరిస్థితి, లక్షణాలనుబట్టి అత్యవసర సేవలకు కాల్ చేయడం, అవసరమైతే ఆక్సిజన్ , CPR అందించడం చాలా కీలకం. దీంతోపాటు తీవ్రమైన అలెర్జీలు ఉన్న వాళ్లు, అత్యవసర మందులను తమతో తీసుకెళ్లాలి. అలాగే వాటిని ఎలా ఉపయోగించాలో వారి చుట్టూ ఉన్నవారికి తెలియజేయడం చాలా అవసరమని డాక్టర్ రషీద్ అన్నారు. ఎలర్జీ మొదలై, అకస్మాత్తుగా కుప్పకూలిపోతూ, ప్రతీ సెకనూ చాలా కీలకమన్నారు.

తీవ్రమైన అలెర్జీ, తీసుకోవలసిన చర్యలు
వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి
నాడి ,శ్వాసను తనిఖీ చేయాలి
ప్రతిస్పందించకపోతే, CPR  చేయాలి.
అందుబాటులో ఉంటే ఎపినెఫ్రిన్ ఆటో-ఇంజెక్టర్ (ఎపిపెన్)ఇవ్వాలి.
వ్యక్తిని వాంతి చేసుకోకుండా ఉండేలా  చూడాలి.
వ్యక్తి స్పృహలో ఉండి తేలికపాటి లక్షణాలు (వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి) చూపిస్తే, వారిని ప్రశాంతంగా , నిటారుగా కూర్చోబెట్టాలి.

ఇలాంటి సంఘటనలను నివారించడం ఎలా? 

ఇలాంటివి అరుదైనవే అయినప్పటికీ,  ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు ప్రాణాలకే మప్పు తెస్తాయి. అచ్చం సంజయ్‌ కపూర్‌ ఉదంతంలోలాగా. బహిరంగ ప్రదేశాల్లో క్రీడల సమయంలో, ముఖ్యంగా కీటకాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మౌత్‌గార్డ్ లేదా ఫేస్‌మాస్క్‌ ధరించాలి.

తేనెటీగలు చక్కెర సువాసనలకు ఆకర్షితులవుతాయి కాబట్టి, బహిరంగ ప్రదేశాలలో దాచని తీపి పానీయాలు తాగకుండా ఉండాలి.

ఒకవేళ ఏదైనా అలెర్జీ ఉంటే, ఎపిపెన్‌ను ఎపుడూ దగ్గర పెట్టుకోవాలి.  దానిని ఎలా ఉపయోగించాలో  పక్క వాళ్లకి తప్పకుండా తెలియజేయాలి. అనాఫిలాక్సిస్  లక్షణాలను, త్వరగా ఎలా స్పందించడం  ఊహించని, ప్రమాదకర  పరిస్థితులలో కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)