Breaking News

రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్‌ని జస్ట్‌ రూ. 875లకే అమ్మకం..!

Published on Thu, 02/06/2025 - 16:21

కోట్లు ఖరీదు చేసే హోటల్‌ కచ్చితంగా అంతకు మించిన ధరలో అమ్ముడుపోతుంది. అది పక్కా..!. పోనీ అలా కాదనుకుంటే.. కనీసం దాని విలువకు దగ్గరదగ్గరగా లేదా కొద్దిపాటి తేడాతో మంచి ధరలోనే అమ్ముడవుతుంది. కానీ ఇక్కడ కోట్లు ఖరీదు చేసే హోటల్‌ జస్ట్‌ వందల రూపాయల్లోనే అమ్ముడైతే..ఎవ్వరికైనా ఏంటిది అనే డౌటు వచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు అంత తెలివతక్కువగా ఎవడ్రా అమ్మింది అనుకుంటారు. కానీ అలా ఎందుకు అమ్ముతున్నారో వింటే శెభాష్‌ అని ప్రశంసించకుండా ఉండలేరు.

ఇంతకీ అమ్మడానికి కారణం ఏంటంటే..అమెరికా కొలరాడోలోని డెన్వర్‌లో మాజీస్టే ఇన్‌ మోటెల్‌ హోటల్‌ విలువ ఏకంగా రూ. 75 కోట్లు ఉంటుంది. అంత ఖరీదుకే డెన్వర్‌ నగరం ఈ హోటల్‌ని కొనుగోలు చేసింది కూడా. అయితే ప్రస్తుతం దాన్ని నగరం కొద్దిపటి మరమత్తులు చేసి అమ్మేయాలనుకుంది. 

ఎంతకో తెలిస్తే కంగుతింటారు. కేవలం రూ. 875లకే అమ్మేస్తారట. కానీ వాళ్లుపెట్టే షరతులకు అంగీకరిస్తే అంత తక్కువ ధరలో అంత ఖరీదు చేసే హోటల్‌ని సొంత చేసుకోగలరని చెబుతున్నారు డెన్వర్‌ నగరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్‌బరీ. 

ఆ షరతులేంటంటే..
దీన్ని 99 ఏళ్లపాటు ఆదాయ నిరోధిక గృహంగా ఉంచాలట. అలాగే నిరాశ్రయులకు సహాయ గృహంగా ఉండాలనే షరతులకు అంగీకరిస్తే గనుక ఈ హోటల్‌ని తక్కువ ధరకే అమ్ముతామని చెప్పారు డెన్వర్‌ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్‌బరీ. ఈ హోటల్‌ని పునరుద్ధరించి నిరాశ్రయలుకు నివాసంగా మారుస్తున్నాని అంగీకరిస్తేనే.. ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేయగలరన్నారు. 

మరీ ఇంతకు ఎవరూ దీన్ని పునరుద్ధరించి కొనుగోలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది అందుకోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు వుడ్‌బరీ. ఆ ప్రతిపాదిత డెవలప్పర్‌ ఆమోదం నగర్‌ కౌన్సిలో చేతిలో ఉంటుందట. 

నిరాశ్రయులైనవారికి చక్కటి వసతిని కల్పించడమే లక్ష్యంగా ఈ వినూత్న డీల్‌ని తీసుకొచ్చినట్లు వివరించారు వుడ్‌బరీ. అంతేగాదు భవనాన్ని యథాతథంగా అమ్ముతామని కూడా చెబుతున్నారు. మరీ ఎవరు దీన్ని కొని ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంటారనేది వేచి చేసి చూడాల్సిందే. 

(చదవండి: మానవ ఐవీఎఫ్‌ సాయంతో కంగారూ పిండాలు..!)

#

Tags : 1

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)