Hot Summer చర్మానికి కావాలి చల్లదనం, ఈ మాస్క్‌లు ట్రై చేయండి!

Published on Thu, 04/18/2024 - 11:19

వేసవి ఎండలు మండిస్తున్నాయి.  ఉదయం  9 గంటలకే ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో   తగినన్ని  నీళ్లు తాగుతూ బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యత  ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ముఖ్యం. అలాగే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. చెమట పొక్కులు, దురదలు లాంటి రాకుండా ఉండాలంటే చర్మానికి  సాంత్వన కలిగేలాకొన్ని జాగ్రత్తలు  పాటించాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు మీకోసం 

ముఖ్యంగా ఎండ వేడినుంచి ఉపశమనం కలిగేలా అందుబాటులో ఉన్న సహజమైన పదార్థాల ద్వారా  కొన్ని ఫేస్‌ మాస్క్‌లను చూద్దాం.

హనీ-యోగర్ట్‌ మాస్క్‌ : ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తాజా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసి పదిహేను  నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడగాలి.  
వాటర్‌ మెలన్‌ మాస్క్‌: పుచ్చకాయ ముక్కలు అర కప్పు తీసుకుని చిదిమి గుజ్జు చేయాలి. ఆ గుజ్జును, నీటిని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. 

కోకోనట్‌ ఆయిల్‌-టర్మరిక్‌ మాస్క్‌: టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనెలో అర టీ స్పూన్‌ స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖం, మెడ, చేతులు, ΄ాదాలకు పట్టించాలి. కొంత ఆరిన తర్వాత (పూర్తిగా ఎండిపోకముందు) వేళ్లతో వలయా కారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. నూనె జిడ్డు పూర్తిగా వదలక΄ోయినప్పటికీ నీటితో కడిగి టిష్యూతో తుడవాలి తప్ప సబ్బు వాడరాదు. 
పపయా– హనీ మాస్క్‌: బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు అర కప్పు తీసుకుని బాగా చిదమాలి. అందులో టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. 
మింట్‌-కుకుంబర్‌ మాస్క్‌: కీరదోస కాయ చెక్కు తీసి అర కప్పు ముక్కలు తీసుకోవాలి. అందులో గుప్పెడు పుదీన ఆకులు వేసి మిక్సీలో గ్రైండ్‌ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.

నోట్‌: ఎండలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా లభించే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. 

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)