మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
ముఖం ముత్యంలా కాంతిగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
Published on Thu, 01/25/2024 - 11:41
పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో దొరికే వాటితోనే ముఖాన్ని ముత్యంలా మెరిసేలా చెయ్యొచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. ఇంతకీ ఆ హెర్బల్ ఫేస్‌ప్యాక్‌లు ఏంటో చూద్దామా!.
ఇంట్లో రోజూ వాడే వాటితోనే చేసుకోగలిగిన ట్రీట్‌మెంట్‌లు. ఇక్కడ ఇచ్చినవన్నీ ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని హెర్బల్ ఫేస్‌ప్యాక్‌లు.
- చందనం ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంతోపాటు మొటిమలు, యాక్నేతోపాటు వేడితో చర్మం పొంగినప్పుడు వచ్చిన ఎర్రటి మచ్చలను కూడా తొలగిస్తుంది. చందనంలో పన్నీరు కలిపి ప్యాక్ వేస్తుంటే మంచి ఫలితాన్నిస్తుంది. ఎండకాలంలో ఈ ప్యాక్ వేస్తుంటే శరీరానికి చల్లదనాన్నిస్తుంది.
- బొప్పాయి చెక్కు, అరటి తొక్కలు కూడా సౌందర్య సాధనాలే. వీటిని లోపలి వైపు (గుజ్జు ఉండే వైపు) చర్మానికి అంటేలా రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా ముఖం స్వచ్ఛంగా ముత్యంలా మెరుస్తుంది.
- ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టీ స్పూన్ పాలపొడి కాని తాజా పాలు కాని కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తుంటే రెండు వారాలకు ఇనుమడించిన చర్మకాంతి స్పష్టంగా కనిపిస్తుంది.
- చర్మాన్ని నునుపుగా కాంతివంతంగా చేయడంలో కమలా, బత్తాయిపండ్లు బాగా పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏదో ఒక రసాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ముఖానికి రాసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇవి ముఖాన్ని క్లియర్‌గా చేయడంతోపాటు స్కిన్ టోనర్‌గా కూడా పనిచేస్తాయి.
(చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?)
#
Tags : 1