Breaking News

అరటిపండుతో అదిరిపోయే అందం.. ఈ ప్యాక్‌తో ఇన్ని ఉపయోగాలా?

Published on Tue, 06/20/2023 - 17:08

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? వాటికోసం వేలకువేలకు తగలేసి కాస్మొటిక్స్‌ వస్తువులు కొంటుంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే దొరికే అరటిపండుతో నిగనిగలాగే స్కిన్‌టోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు తింటే ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందమైన చర్మం కోసం అరటింపడుతో ఇలా ప్యాక్‌ వేసుకోండి..

♦ బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
♦ అరటిపండు గుజ్జులో తేనే, పసుపు కలుపుకొని రాసుకుంటే ఇన్‌స్టంట్‌ గ్లో వస్తుంది.
♦ అరటిపండును మెత్తగా చేసుకోని దానిలో వేపాకు పౌడర్‌ను కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది.
♦ మెటిమలు, వాటి తాలూకూ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మీ సమస్యకు చక్కని పరిష్కారం.ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్‌లా మ్యాష్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  
♦ అరటిపండు గుజ్జులో రెండు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా మారుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)