జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
కరెంటుకథ తెలుసా?
Published on Sat, 01/24/2026 - 11:29
విద్యుత్తుకు 200 ఏళ్ల చరిత్ర ఉంది.విద్యుత్తు అనేది ఎలక్ట్రాన్ల ప్రవాహం.
విద్యుత్తు ఒక వాహకం గుండా ప్రవహిస్తుంది. దీన్ని ఆంపియర్స్‌లో కొలుస్తారు.
ఇవాళ పోద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా కరెంట్ (పవర్/ఎలక్ట్రిసిటీ/విద్యుత్తు) లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కరెంట్ లేకుండా ఏ పనీ జరగదు. అలా మన నిత్యజీవితంలో కరెంట్ ఒక కీలకమైన అంశంగా మారింది. కాసేపు కరెంట్ పోయినా విలవిలలాడిపోతుంటారు కొందరు. మరి ఈ కరెంట్ కథేమిటో తెలుసా?
బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త మెరుపును విద్యుత్ అని నిరూపించాడు. ఆ తర్వాత 1800 సంవత్సరంలో అలెశాండ్రో వోల్టా మొదటి రసాయన బ్యాటరీని (వోల్టాయిక్ పైల్) కనుగొన్నారు. ఇది నిరంతర విద్యుత్ ప్రవాహానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బును తయారు చేశారు. నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ వ్యవస్థలను,మోటార్‌లను అభివృద్ధి చేసి విద్యుత్ ప్రసారంలో విప్లవం తెచ్చారు.
అప్పటి నుంచి విద్యుత్తు వ్యవస్థ పటిష్ఠంగా మారింది. ఎలక్ట్రాన్ల ప్రవాహం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడం,నియంత్రించడం వంటివి మొదలయ్యాయి. ప్రస్తుతం జల విద్యుత్, థర్మల్ విద్యుత్,సోలార్ విద్యుత్, పవన విద్యుత్... అలా అనేక పద్ధతుల్లో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు.కరెంట్ మీద ఆధారపడి అన్ని పరిశ్రమలు, కర్మాగారాలు నడుస్తున్నాయి. ఒక్క నిమిషం కరెంట్ పోయినా కోట్ల రూ΄ాయల నష్టం వచ్చే అవకాశం ఉంది.
Tags : 1