Breaking News

ఆ వివరాలు బహిర్గతం చేస్తే.. రెండేళ్లు జైలు!

Published on Fri, 08/23/2024 - 08:40

ఇటీవల కోల్‌కతాలోని ఆర్‌.జి. కర్‌ మెడికల్‌ కాలేజ్‌లో అత్యంత అమానుషంగా హత్యాచారానికి గురైన మహిళా డాక్టర్‌ ఘటన పై దేశవ్యాప్తంగా చాలామంది స్పందిస్తున్నారు. ఎంతోమంది నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు మాత్రమే కాకుండా సమాజం కూడా ఇటువంటి ఘటనలపై స్పందించడం చాలా అవసరం. అయితే ఇలాంటి అంశాలపై స్పందించేటప్పుడు బాధితురాలి గుర్తింపు బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  సెక్షన్‌ 72, భారతీయ న్యాయ సంహిత (228 ఏ, ఐ.పీ.సీ) ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి వివరాలను బహిర్గతం చేసిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.

కోల్‌కతా హత్యాచార బాధితురాలి ఫోటోలు, పేరు, ఇతర వివరాలు అన్నీ సామాజిక మాధ్యమాలలో చాలామంది బహిర్గతం చేస్తున్నారు. అంతేకాక రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ఇటీవల ఒక న్యాయవాదుల సంఘం నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో సైతం బాధితురాలి పేరుని బ్యానర్లలో ముద్రించి మరీ ప్రదర్శించడం, అందులో చాలామంది మహిళా న్యాయవాదులు కూడా ఉండడం బాధాకరం. అది కోర్టు ధిక్కరణ కూడా. ఈనెల 16వ తేదీన కలకత్తా హైకోర్టు బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడానికి వీలులేదు అని స్పష్టం చేసింది. 20న సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో సైతం బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడంపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా ఎవరూ చేయడానికి వీల్లేదని ఆదేశించారు. 

పోక్సో చట్టం సైతం బాధిత–బాలుర వివరాలను గోప్యంగా ఉంచాలి అని చెబుతుంది. సంచలనం సృష్టించిన ‘కఠువా గ్యాంగ్‌ రేప్‌ – హత్య’ కేసులో ఆ నిబంధనను అతిక్రమించిన పలు మీడియా సంస్థల మీద కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు వార్తలను ఉపసంహరించుకోవాలి అని ఆదేశిస్తూ భారీ జరిమానాలు కూడా విధించింది. లైంగిక దాడికి గురైన బాధితురాలు లిఖిత పూర్వకంగా తన అంగీకారాన్ని తెలిపితే తప్ప, బాధితురాలి వివరాలను బహిర్గతం చేయకూడదు. బాధితురాలు ఒకవేళ మరణించినా లేదా ఆమెకు మతిస్థిమితం లేకున్నా కూడా ఆమె వివరాలు బహిర్గతం చేయడానికి వీలు లేదు. ప్రత్యేక కారణాలు చూపిస్తూ, కుటుంబ సభ్యులు న్యాయస్థానం ముందు దరఖాస్తు చేస్తే, కేవలం కోర్టు మాత్రమే అలాంటి అనుమతిని ఇవ్వాలి అని చట్టం చెబుతోంది. – శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)