Breaking News

నటి అనుకుట్టి ఇష్టపడే స్టైలిష్‌వేర్‌లు ఇవే..!

Published on Sun, 10/12/2025 - 09:48

శారీలో కొత్త డ్రేపింగ్‌ స్టయిల్స్‌ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్‌ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్‌

అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్‌ ఫాలో అయ్యే స్టయిలింగ్‌ టిప్స్‌ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. 

ఇక్కడ అనుమోల్‌ ధరించిన చీరబ్రాండ్‌: చినాయా బెనారస్‌, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్‌:  దీపాలీ డిజైన్స్‌, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

స్టిచ్డ్‌ జ్యూలరీ
ఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్‌ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్‌ జ్యూలరీ బ్లౌజ్‌ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్‌లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్‌లా గ్లామర్‌ జోడించే ఈ మగ్గం వర్క్‌ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి. 

ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్‌లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్‌తోనే మీ స్టయిల్‌ నేరుగా స్టార్‌డమ్‌ లెవెల్‌కి చేరుతుంది. సింపుల్‌ కలర్‌ చీరతో కలిపితే మగ్గం వర్క్‌ మరింత హైలైట్‌ అవుతుంది, హెయిర్‌ స్టయిల్‌ బన్‌ లేదా సైడ్‌ ప్లేట్స్‌ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్‌ మేకప్‌ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్‌ ఫిటింగ్‌ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్‌ డిజైన్‌  మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది.  

దీపిక కొండి

(చదవండి:  అందాల ఆషికా రంగనాథ్‌ స్టైలిష్‌ వేర్‌లు ఇవే..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)