Breaking News

పురిటినొప్పులను గుర్తించడం ఎలా..?

Published on Sun, 06/22/2025 - 08:29

గర్భిణులకు తొమ్మిది నెలలు నిండాక వచ్చే ప్రతి నొప్పులూ పురిటినొప్పుల్లాగానే అనిపిస్తుంటాయి. అలాంటి నొప్పులతో కొన్నిసార్లు ఆసుపత్రి వరకు వెళ్లాక కూడా అవి నిజమైన పురిటినొప్పులు కావంటూ... ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రసవం అయిన కేసులూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా అని తెలుసుకోడానికి తోడ్పడే అంశాలేమిటో చూద్దాం.

గర్భవతులకు నెలలు నిండాక గర్భసంచి కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల నొప్పులు వస్తున్నట్లుగా అనిపిస్తాయి. నిజానికి గర్భవతుల్లోనే కాకుండా మామూలు మహిళల్లోనూ గర్భసంచికి సంకోచ వ్యాకోచాలు కలుగుతూనే ఉంటాయి.

బ్రాక్స్‌టన్‌ – హిక్స్‌ కంట్రాక్షన్స్‌?
ఇక గర్భవతుల్లోనైతే ప్రసవానికి చాలా రోజుల ముందు నుంచే గర్భసంచి కండరాల్లో సంకోచవ్యాకోచాలు ఒక తెర తర్వాత మరో తెర... ఇలా తెరలు తెరలుగా వస్తూ ఉంటాయి. వీటినే ‘బ్రాక్స్‌టన్‌–హిక్స్‌ కంట్రాక్షన్స్‌’ అంటారు. ఈ సంకోచ వ్యాకోచాలు తొమ్మిది నెలలపాటూ వస్తూనే ఉంటాయి. 

కాకపోతే నెలలు నిండేకొద్దీ ఇవి వచ్చే వ్యవధీ అలాగే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ పూర్తిగా నెలలు నిండేనాటికి అవి పురిటినొప్పులుగా రూపాంతరం చెందుతాయి. ఈ సంకోచవ్యాకోచాల సమయంలో పొట్ట కండరాలు బిగుసుకుని, ఆ తర్వాత మెత్తబడుతూ ఉంటాయి. 

ఏవి పురిటినొప్పులు? 
గర్భసంచి కండరాల్లోని సంకోచ–వ్యాకోచాల్లో ఏవి పురిటి నొప్పులో గుర్తించడానికి ఒక కొండగుర్తు ఏమిటంటే... ఈ సంకోచ సమయంలో పొట్ట కండరాలు గట్టిబడటంతోపాటు నొప్పి కూడా వస్తుంటుంది. ఈ నొప్పి నడుము వెనక భాగం నుంచి మొదలై క్రమంగా ముందు భాగంలో తొడల వరకు వ్యాపిస్తూ ఉంటుంది. 

పురిటి నొప్పులు మొదలయ్యాక ఇక ఆ నొప్పులు వస్తూ తగ్గుతూ... ఉంటాయి. ఈ పురిటినొప్పులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతున్నప్పుడు గర్భసంచి పైభాగం ముడుచుకుంటూ, ముఖద్వార భాగం తెరచుకుంటూ ఉంటే అవి నిజమైన పురిటి నొప్పులని గ్రహించవచ్చు. 

నిజమైన పురిటినొప్పులు వస్తున్నప్పుడు... 
10 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు కండరాల సంకోచాలు వస్తూ... ఒక్కో సంకోచ సమయం కనీసం 45 సెకన్ల పాటు కొనసాగుతూ, అదే టైమ్‌లో గర్భాశయ ముఖద్వారం తెరచుకుంటూ ఉంటే అది నిజమైన ప్రసవ సమయం (ట్రూ లేబర్‌) అని చెప్పవచ్చు. 

డాక్టర్‌ దగ్గరకు ఎప్పుడు? 
ఇక చాలామంది గర్భవతులకు ఒక డౌట్‌ వస్తుంటుంది. తాము నొప్పులను గుర్తించాక డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లడం మంచిదనే సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. గర్భవతులకు భరించలేనంత నొప్పులు వస్తూ ఉన్నప్పుడుగాని; ఇలా పురిటినొప్పులు వస్తూ అదే టైమ్‌లో ఏదైనా రక్తస్రావం కనపడుతున్నా గాని; తమ ప్రమేయం లేకుండానే ఉమ్మనీరు పడిపోతున్నాగాని; లేదా కడుపులో బిడ్డ తిరిగినట్లు అనిపించకపోయినా గానీ... ఈ నాలుగు సందర్భాల్లో తప్పని సరిగా, అత్యవసరంగా డాక్టర్‌ను కలవాలి. నిజానికి పురిటినొప్పులను గుర్తించడమన్నది కాబోయే తల్లి కంటే డాక్టర్లకే ఎక్కువగా తెలిసే అవకాశముంటుంది. 

కాబట్టి అవి ట్రూ లేబర్‌ పెయిన్స్‌ అయినా కాకపోయినా... నొప్పి వస్తున్నట్లు గుర్తించగానే అత్యవసరంగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. ఒకవేళ అవి ట్రూ లేబర్‌ పెయిన్స్‌ అయితే డాక్టర్లు గర్భవతి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. దాంతో ప్రసవం సురక్షితంగా జరుగుతుంది. ఒకవేళ అది హై–రిస్క్‌ ప్రెగ్నెన్సీ అయితే ముందుగానే వచ్చి హాస్పిటల్‌లో చేరాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు.   
డా. నర్సేపల్లి శోభారాణి, సీనియర్‌ అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌ 

(చదవండి:   చేతి రాతే భవిష్యత్తుకు బాట..         )

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు