Breaking News

US: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు

Published on Mon, 05/29/2023 - 21:14

అమెరికా అనగానే.. చాలా మంది మన వాళ్లకు ఒక్కసారయినా చూసి రావాలని కలగంటారు. రోజూ వేల మంది ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ చూసి అంతా గొప్పే అనుకోవడంలో తప్పులేదు కానీ.. అక్కడ బయటికొస్తున్న వీపరీత మనస్తత్వాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. తుపాకీ సంస్కృతి, విచ్చలవిడిగా డ్రగ్స్, పతనమవుతున్న కుటుంబ విలువలు, మానసిక ఉన్మాదులు.. వీటన్నింటిని అవలోకనం చేసుకుంటే.. అమెరికాను నిజంగా అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ ఇచ్చిన కొన్ని ఉదాహారణలు, వాటి వెనక ఆయన విశ్లేషణలు తప్పక పరిశీలించాల్సిందే.

సంఘటన 1

  • అవతల అగ్ర దేశపు అధ్యక్షుడు. ప్రపంచం లో అత్యున్నత స్థాయి రక్షణ వ్యవస్థ. లింగులిటుకు మంటూ మనోడు. విమానం దిగి ఒక ట్రక్ తీసుకొని కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి హిట్లర్ రాజ్యాన్ని స్థాపిస్తాడట. పిచ్చికి పరాకాష్ట. కాదా ? కానీ ఇలాంటి పిచ్చోళ్ళు ఆ సమాజంలో చెట్టుకొకరు .. పుట్టకొకరు.. మంచు గడ్డ కొకరు. ఎందుకు పుట్టుకొని వస్తున్నారో పరిశోధిస్తే.. చర్చిస్తే.. తెలుసుకొంటే .. ఆ సమాజపు డొల్ల పునాది బయటపడుతుంది.

సంఘటన 2

  • అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం.! ఒక 18 ఏళ్ళ యువకుడు.. తన తల్లితండ్రులను, ఇద్దరు సోదరులను ఇంటిలో కాల్చి చంపేశాడు. “వారు నరమాంస భక్షణకు అలవాటు పడ్డారు. నన్ను చంపి తినేయాలని ప్లాన్ చేశారు. అందుకే చంపేసాను, అని పోలీసులకు చెప్పాడు. ఇంకో ఘటన చూద్దాం. పాఠశాలల్లో కాల్పుల ఘటనలు జరగకుండా ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టనుంది.

అవి ఏంటంటే..

  1. పాఠశాల సిబ్బంది స్కూల్‌కు వచ్చేప్పుడు వెంట గన్స్ తీసుకొని పోవడం
  2. రెండోది మానసిక ఉన్మాదులతో ఎలా వ్యవహరించాలో శిక్షణ

కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వెయ్యాలి .. అనేది ఒక సామెత. అమెరికాలో రివర్స్‌.. చంపినోడికి పిచ్చోడు అని ముద్ర వేస్తారు. అక్కడితో ఆ సమస్య తీవ్రతను అక్కడి జనాలు వెంటనే/సాధ్యమైనంత త్వరగా మరిచిపోతారు.

ఎవడో పిచ్చోడు చేసినదానిపై చర్చ ఎందుకులే అని వదిలేస్తారు.

ఇక్కడ కొన్ని ప్రశ్నలు

  1. చంపాలనుకునే పిచ్చోళ్ల సంఖ్య ఎందుకు రానురాను పెరిగిపోతోంది ?
  2. పిచ్చోడి చేతిలో రాయే ప్రమాదం .. అలాంటిది పిచ్చోడి చేతికి పిస్టల్ వెళ్లే దౌర్భాగ్య స్థితిలో ఆ దేశం ఎందుకుంది ?
  3. పిచ్చి వెనుక కారణాలు ఏంటి ? ఎవరూ అడగరు .. అడిగినా సమాధానాలు రావు.


వాసిరెడ్డి అమర్‌నాథ్‌
ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు

Videos

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)