Breaking News

ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...

Published on Tue, 11/12/2024 - 09:18

చాలామంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతోనో లేదా బద్ధకం అలవాటవుతుందనో పిల్లలను ఎక్కువ సేపు నిద్రపోనివ్వరు. వాళ్లు కంటి నిండా నిద్రపోకముందే నిద్రలేపేస్తుంటారు. కారణం... వాళ్లు అలా నిద్రపోతూ ఉండటం, చురుగ్గా లేకపోవడంతో వాళ్లకేమైందో అన్న ఆందోళన వాళ్లను అలా నిద్రలేపేలా చేస్తుంది.పిల్లలు కంటినిండా నిద్రపోకపోవడం వల్ల వాళ్లు చికాకుగా, చిరాగ్గా ఉంటారని తెలుసుకోవాలి. రానున్నది చలికాలం. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా సేపు నిద్రపోవడం చాలా సాధారణం.

చలికాలంలో ఎక్కువ సేపు నిద్ర ఎందుకు?
పిల్లలు చలికాలంలో కొద్దిగా ఎక్కువగా నిద్రపోవడం చాలా సాధారణం. దీనికి మొదటి కారణం చలికాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి నిడివి ఎక్కువ; రెండోకారణం వెలుగు తగ్గిపోయి చీకటి పడగానే నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ హార్మోన్‌ స్రావాలు పెరగడం, నిద్ర మేల్కోడానికి ఉపయోగపడే సెరటోనిన్‌ స్రావాలు తగ్గడం... వంటి మార్పుల వల్ల చలికాలంలో నిద్ర పెరుగుతుంది. 

పిల్లలు ఎక్కువసేపు పడుకోవడానికి కొన్ని  కారణాలు... 

⇒ బరువు ఎక్కువగా ఉన్న చిన్నారులు 
⇒ శ్వాస తీసుకోవడంలో సమస్యలున్నప్పుడు 
⇒ సర్కాడియన్‌ రిథమ్‌లో మార్పులు (మనుషుల్లో నిద్రపోవడం, నిద్రలేవడంలోని క్రమబద్ధతను నిర్వహించే రిథమ్‌ను సర్కాడియన్‌ రిథమ్‌ అంటారు) 
⇒మెదడు పనితీరులో కొన్ని లోపాలు ∙దగ్గు, జలుబు, అలర్జీలకు వాడే కొన్ని మందులు ∙ఆహార పదార్థాలు, హర్మోన్లలో మార్పుల వల్ల నిద్ర వ్యవధిలో మార్పులు రావడం వంటి అంశాలు నిద్ర పెరగడానికి 
కారణమవుతాయి.  

మరి... ఎన్ని గంటల నిద్ర నార్మల్‌...? పిల్లల్లోగాని, పెద్దల్లోగాని ఖచ్చితంగా నిద్రపోవాల్సిన వ్యవధి ఇదీ అంటూ ఎవరూ నిర్దిష్టంగా, నిర్ధారణగా చెప్పలేరు. మనుషులకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందన్న అంశం ఎప్పుడూ చర్చనీయాంశమైన విషయమే. అయితే సాధారణంగా పిల్లలు 8–9 గంటల పాటు నిద్రపోవడాన్ని నార్మల్‌గా పరిగణించవచ్చు. రోజూ పది గంటలకు మించి నిద్రపోవడాన్ని మాత్రమే కొన్ని రుగ్మతలకు సూచికగా చెప్పవచ్చు. ఒక ఉజ్జాయింపుగా చె΄్పాలంటే రోజుకు పదిగంటల కంటే ఎక్కువ, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్నారులు ఈ వ్యవధి కంటే తక్కువగా నిద్రపోతుంటే ఒకసారి థైరాయిడ్‌ హార్మోన్‌ పరీక్షలు చేయించి, పిల్లల డాక్టర్‌ను  సంప్రదించడం తప్పనిసరి.
 

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)