పెంపుడు కుక్క మరణంతో తీవ్ర మనోవేదన!

Published on Thu, 06/05/2025 - 08:34

మా పెంపుడు కుక్క 12 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే జబ్బు చేసి చనిపోయింది. మాకు పిల్లలు లేని కారణంగా, కుక్కతో మాకు చాలా అటాచ్‌ మెంట్‌ ఉండేది. నాకు బాధగా ఉన్నప్పటికీ, మా ఆయన మరీ డీలా పడిపోయారు! రోజు దానిని నడకకు తీసుకెళ్ళడం, రాత్రి భోజనం పెట్టడం, స్నానం చేయించడం, ఆయన ఎంతో శ్రద్ధతో చేసేవారు. అది చనిపోయిన తరువాత ఆయన బాగా డల్‌ అయి మాటలు కూడా తగ్గాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటున్నారు. రాత్రులు నిద్ర పట్టక గంటల తరబడి అటు ఇటు తిరుగుతున్నారు. బిజినెస్‌ మీద కూడా ముందున్న శ్రద్ధ పెట్టడం లేదు నా భర్తను కోల్పోతున్నానని, భయమేస్తోంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు.  
– మంజుశ్రీ, విశాఖ పట్టణం 

మీ ఉత్తరంలో మీ భర్త ఎదుర్కొంటున్న తీవ్రమైన మానసిక వేదన స్పష్టంగా కనిపిస్తోంది. 12 సంవత్సరాలుగా అంతప్రేమగా పెంచుకున్న పెట్‌ని కోల్పోవడం మీ ఇద్దరికీ ఎంత బాధాకరమో నేను ఊహించగలను. దానికి రోజూ మార్నింగ్‌ స్నాక్స్, రాత్రి భోజనం, స్నానం వంటి రోజు వారికి కార్యాలు చేయించడం  ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా అయినట్లు అనిపిస్తుంది. ఆయన మనోవేదన, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత తీవ్రంగా ఉన్నట్లుంది. పెంపుడు జంతువులు అందునా ముఖ్యంగా కుక్కలు, మన భావోద్వేగ జీవితంలో ఒక అంతర్భాగం అవుతాయి. అవి నిష్కపటమైన ప్రేమను పంచుతాయి. 

మీ భర్త ఒంటరితనం, నిద్రలేమి, పనిలో ఇబ్బందులు చూస్తే ఆయన ‘కాంప్లికేటెడ్‌ గ్రాఫ్‌’ అనే మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని అనిపిస్తుంది. మార్నింగ్‌ వాక్, కుక్కకు రాత్రి భోజనం పెట్టడం వంటిని ఆయనకు ఒక నిర్దిష్టమైన రొటీన్‌ను అందించాయి. అవి లేకపోవడం, వల్ల అతని దైనందిన జీవితంలో ఒక శూన్యత ఏర్పడినట్లుంది. కొన్నిసార్లు కుక్క చనిపోయినప్పుడు దాన్ని బతికించుకోలేక పోయాననే గిఫ్ట్‌ ఫీలింగ్‌ కూడా ఉండొచ్చు! మన సమాజం పురుషులను తమ దుఃఖాన్ని బయటకు వెలిబుచ్చకుండా మనసుల్లో దాచుకొనేందుకు ఒత్తిడి చేస్తుంది. 

ఇది కూడా ఆయన ప్రస్తుత ప్రవర్తనకు ఒక కారణం కావచ్చు. ఆయన పడుతున్న వేదనను మీరు అర్థం చేసుకొని ‘నేను నీకోసం నీతోనే ఉన్నాను’ అనే విషయాన్ని ఆయనకు అర్థం అయేలా వ్యక్తం చేయండి. ఇది అతను ఓపెన్‌ అప్‌ అయ్యే అవకాశం ఇస్తుంది. మీ కుక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటడం లేదా ఫోటో ఆల్బమ్‌ తయారు చేయడం లాంటిని ఆయనతో చేయించండి. ఆయన రొటీన్‌ను కొనసాగించడానికి, ఉదయం నడకకు కలిసి వెళ్దామని సూచించండి. 

ఆయన నిద్రలేమి ఒంటరితనం, పనిలో ఇబ్బందులు కొనసాగితే ఒక సైకియాట్రిస్ట్‌కి చూపించి కౌన్సెలింగ్, ఇంకా అవసరం అయితే కొన్ని మందులు, వాడించండి. మీ కుక్కకు సంబంధించిన మంచి జ్ఞాపకాలు పంచుకోండి. మీ ప్రేమ, సాంగత్యం అతనికి శక్తిమంతమైన సపోర్ట్‌గా ఉంటాయి. మీరు ఆత్మస్థైర్యంతో ఈ పరిస్థితిని తప్పకుండా – అధిగమిస్తారని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్‌.
డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ sakshifamily3@gmail.com )

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

క్రిస్మస్‌ కళ.. అందంగా ముస్తాబైన చర్చిలు (ఫొటోలు)

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)